పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము =3 కేంద్రకణ భౌతికశాస్త్రము

సై క్లోట్రాన్ (Synchrocyclotron). ప్రోటాన్ సింక్రో ట్రాన్ (Proton Synchrotron) మున్నగు పెక్కు శక్తి మంతములైన యంత్రములు అణువులకు మిక్కిలి హెచ్చయిన శక్తి నిచ్చుచున్నవి. కృత్రిమ రేడియో యాక్టివిటి (Artificial Radio Activity) : రేడియో యాక్టివ్ ద్రవ్యములను కృత్రి మముగా తయారుచేయు విధానమును 1934 లో ఫ్రెంచి దంపతులు ఫ్రెడరిక్ జోలియో, ఐరీస్ క్యూరీలు కను గొనిరి. బీజ రూపాంతర విధానములో కొన్ని సమయము లందు అస్థిరమైన సమస్థానీయములు పుట్టి, అవి పోజి ట్రానును గాని, లేక న్యూట్రానును గాని బహిర్గతము చేసి (emit) స్థిరస్థితిని పొందును. న్యూట్రానుల సహాయ మున పెక్కు స్థిరమూల ద్రవ్యముల రేడియోయాక్టివ్ సమస్థానీయములను ప్రేరేపింపవచ్చునని విఖ్యాత ఇటా లియను విజ్ఞానశాస్త్ర వేత్త 'ఫెర్మీ' సూచించి, ప్రయత్నించి సఫలుడయ్యెను. బరువైన మూలద్రవ్యములు బీజములు మెల్లని (slow) న్యూట్రానులను తేలికగా వశపరచు కొనుననిగూడ అతడు చూపెను. ఈ మెల్లని న్యూట్రా నులను - వాటి శక్తి తక్కువగుటచే - తాపన్యూట్రానులు (Thermal Neutrons) అని అందురు. బొరాను, కాడ్మియంవంటి ద్రవ్యములు ఈ తాప న్యూట్రానులను తేలికగా లోగొనును. అందుచే వాటిని తాపన్యూట్రానులకు రక్షకములుగను, వడియగట్టు సాధ నములుగను ఉపయోగింతురు. క్రొత్త రేడియోయాక్టివ్ ద్రవ్యములలో ఇంతవరకు తెలియని కొన్ని మూలద్రవ్యముల సమస్థానీయములు (43, 61, 85, 87 పరమాణు అంకములు గలిగిన మూల ద్రవ్యములు) కనుగొనబడెను. యురేనియం తరువాత పది మూలద్రవ్యములతో నొక నూతనశ్రేణిని గూడ నేర్పరచిరి. బీజనిర్మాణము ; బీజబలములు (Nuclear Structure: Nuclear Forces) : అయస్కాంతిక బిభ్రమిష, స్పిన్, శక్తి మొదలగు విషయముల విచారణ ఫలితముగా బీజములో ఎలక్ట్రా ములకు తావులేదు. తరంగ యాంత్రిక శాస్త్రము (Wave Mechanics) గూడ ఈ అభిప్రాయమునే బలపరచు


చున్నది. పరమాణు బీజము ప్రోటాను, న్యూట్రానులను మాత్రమే కలిగియుండును. 'స్వతస్సిద్ధమైన' లేక ప్రేరే పితమైన బీజ రూపాంతరములలో ధన ఋణ ఎలక్ట్రా సులును, న్యూట్రినోలును బీజమునుండి బయటికివచ్చును. బీజములోని ప్రోటానులు, న్యూట్రానులు పరస్పరముగ మార్పులు పొందవచ్చును. కాని ఈ మార్పులు ఏ విధ ముగా జరుగునో ఇదమిత్థమని తెలియదు. 'యుకావా' సిద్ధాంతము ననుసరించి బీజబలములు విద్యుత్తునకు కాని లేక గురుత్వాకర్షణమునకు (gravita- tional) గాని చెందినవి కావు. అవి అతి తక్కువ దూర ముల (10–18 సెంటీమీటర్లు)లో నే పనిచేయును. అందుచే వాటిని 'తక్కువదూరపు బలములు' (Short Range Forces) అందురు. ప్రోటాను, న్యూట్రానులు వాస్తవ ముగ ఒ కే 'మూల మైన బీజభాగము' Basic nucleonic core) ను కలిగియుండి, అవి మెజానులచే చుట్టుకొనబడి యుండునని ఒక భావము. నేటి సిద్ధాంతముల ప్రకారము, మెజాను మేఘమే న్యూట్రానుకును ప్రోటానుకును మధ్య గల భేదము. ఇవి పరస్పరము మెజానులను 'లోగొని' లేక ‘ఉద్గమించి’ మారుచుండును. అదేవిధముగా ఆవేశరహి తములైన మెజానులు తాదృశములైన న్యూక్లియానుల మధ్యగల బలములను సృష్టించును. బీజనమూనాలు '(Nuclear Models): బీజనిర్మాణ మును గూర్చిన నేటి భావములు ఎక్కువ స్పష్టముగా లేవు. అందుచే ప్రతి నమూనా (model) యొక్క ఉపయోగము మితముగ నున్నది. బీజ బలములు 'తక్కువ దూరపు బలములే' కనుక, అవి బాగుగా పనిచేయవలె నన్న బీజములోని కణము లన్నియు ద్రవబిందువులోని వానివలె అతిదగ్గరగా ఉండవలెనని 'నీల్స్బర్' సూచిం చెను. ద్రవము ఆవిరిగా మారినట్లే బీజములోని కణములు ఉద్గమించును. షెల్ (Shell) నమూనా, ఫెర్మీవాయువు నమూనా, ఆల్ఫాకణముల నమూనా మొదలగునవి కూడ ఆచరణలో నున్నవి. బీజభేదనము (Nuclear Fission): న్యూట్రానుచే పేరేపింపబడిన (excited) యురేనియం బీజము రెండు బీజములలోనికి బ్రద్దలగుట 'మైట్ నర్' అను జర్మను విజ్ఞానశాస్త్రవేత్త కనుగొ నెను. ఈ విధానములో ధన