గౌతమీపుత్రశాతకర్ణి
సంగ్రహ ఆంధ్ర
మొదట ఈ భాగములను జయించి, చోళ రాజ్యముపై విజయయాత్ర సాగించి దక్షిణ సముద్రమువరకు పోయి జయలక్ష్మీ సమేతుడై తిరిగివచ్చెను.
శాతకర్ణి పరాక్రమమునకు వెరచి, యవన, శక, పహ్లవాదు లనేకులు ఆతనికి వశులై రాజభక్తిని జూపుచు మ్లేచ్ఛత్వమును విడిచి పెట్టి జైన, బౌద్ధమతముల నవలంబించి సర్వవిధముల నీ మహారాజునకు తోడ్పడుచుండిరి. శాతకర్ణి తనకు సుముఖులుకాక ప్రతిఘటించిన శాత్రవులను తరుముచు వారి దేశములపై దాడి వెడలుచు, అనేక దినములు వారలతో ఘోరయుద్ధములను జేయుచు, విజయము గాంచుచుండెను. యుగాంత కాలరుద్రుడై దేరిచూడరాకయున్న ఈ శూరాగ్రణి పరాక్రమధాటి నోపలేక పలువురు శత్రువులు ఇతనిని శరణుజొచ్చిరి. కావుననే నాసికాశాసనము నందు "తన భద్రగజముపై నుండి ఆకాశమున దూకి పవన, గరుడ, సిద్ధ, యక్ష, రాక్షస, విద్యాధర, భూత, గంధర్వ, చారణ, చంద్ర, దివాకర, నక్షత్రగ్రహములతో ఢీకొనుచున్నాడో యను నట్లు, అపరిమితము, అక్షయము, అచింత్యము, అద్భుతము అగు విధమున సమరమున శత్రుసైన్యములను జయించిన వాడు" అని ఇతని యుద్ధనైపుణ్యము వర్ణింపబడినది.
ఇట్టి విజయపరంపరలకు ఫలితముగ ఈ మహారాజు సామ్రాజ్యము పశ్చిమోత్తరమున పుష్కరతీర్థము మొదలు ప్రాగ్దక్షిణమున కడలూరు వరకును, ప్రాగుత్తరమున కళింగనగరము మొదలు పశ్చిమ - దక్షిణమున వైజయంతి వరకును వ్యాపించెను. కావుననే బాలశ్రీ శాసనమునం దితడు త్రిసముద్రతోయ పీతవాహనుడని వర్ణింపబడి నాడు. నాసిక శాసనమునం దితడు రాజాధి రాజనియు, అస్మిక, అసక, మూలక సురాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అక రావంతి దేశములకు పాలకుడనియు, వింధ్యావతము, పారియాత్రము, సహ్యము, కృష్ణగిరి, మలయము, మహేంద్రము, శ్రేష్ఠగిరి, చకోరము మొదలగు పర్వతములకు అధినాథుడనియు కీర్తింపబడినాడు. ఆతని కాలమున ఆంధ్రరాజ్యము గంగాతీరము మొదలుకొని, కాంచీపురము వరకు వ్యాపించి యుండెననియు తోచుచున్నది. మహారాష్ట్రములో దొరికిన పదునాల్గువేల నహపాణుని నాణెములలో తొమ్మిదివేల నాణెములవెనుక వైపున "రాణ్ణో గోతమిపుతా ససిరి శాతకానినో" అని గోతమీపుత్త్ర శాతకర్ణి పేరు ముద్రింపబడి యుండుట ఇతని విజయపరంపరలకు చిహ్నముగా నున్నది.
ఇట్లు మహావిజేత, సమ్రాట్టు అయిన గౌతమీపుత్త్రుడు ప్రియదర్శనుడు, చారుగమనుడు అగుట ముదావహమైన విషయము. ఇత డేక బ్రాహ్మణు డనియు, ఏక ధనుర్ధరుడనియు, రామ- కేశవ-భీమార్జునులతో సమానమైన పరాక్రమము కలవాడనియు, నాభాగ - నహుష - జనమేజయ - సగర - యయాతి - రామ - అంబరీషాదులతో సమానమైన తేజస్సు కలవాడనియు, క్షత్రియ దర్పమాన మర్దనుడనియు, శకయవన - పహ్లవ-నిషూదను డనియు, అనేక సమర పరాజిత శత్రుసంఘుడు" అనియు పొగడబడి యున్నాడు. ఈతడు తల్లికి అవిపన్నమైన శుశ్రూష చేయువాడనికూడ సూచింపబడుట ఈతని వినయసంపత్తికిని, గురుజన విధేయతకును నిదర్శనముగా నున్నది. వినీతుడు కావుననే ఈతడు పూర్వ శాతవాహన చక్రవర్తులవలె గాక తన పేరునకు ముందు 'గౌతమీపుత్త్ర ' అని తల్లి పేరును చేర్చుకొనెను.
ఈతని ధర్మ చరిత మెంతయు మనోహరమైనది. శాతవాహనవంశ కీర్తి ప్రతిష్ఠాపనకరుడైన ఈ గౌతమీ పుత్త్రుడు బహుభోగముల ననుభవించినప్పటికిని మదాంధుడు కాలేదు. సర్వరాజ లోకమస్తక పరిగృహీతశాసను డయ్యు పౌరజనులతో సమానముగ తన సుఖదుఃఖములను పంచుకొనుట గౌతమీపుత్త్రుని సత్స్వభావమునకు దృష్టాంతముగ నున్నది. వర్ణ సాంకర్యము నరికట్టి, అనేక ద్విజ కుటుంబములను పోషించినవా డనియు, ఆగమ నిలయు డనియు స్తుతింపబడిన ఇతడు బుద్ధదేవునియందు అధిక భక్తి ప్రపత్తులు చూపుట ఇతని మత సామరస్యమునకును, హృదయ వైశాల్యమునకును తార్కాణము. సర్వ సద్గుణ గరిష్ఠుడైన ఇతడు ధర్మమార్గముననే పన్నులను స్వీకరించెను. "శాస్త్రీయముగా విధించిన సుంకములను గూడ గౌతమీపుత్త్ర శాతకర్ణి తీసివేసెనని" నాసికలోని శాసనము చాటుచున్నది. ఇత డనేక శత్రురాజులను జయించి వారి స్వాధీనములో నుండినట్టి భూములను సాధువుల ఉపయోగార్థము దానము చేసినాడు. ఉదా : నాసిక గుహలోని బౌద్ధాలయముయొక్క సంరక్షణకై
496