Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 8 491 గౌతమబుద్ధుడు

దాటి ఉరువేల యను పట్టణము చేరెను. అచ్చట ఒక తోట యందు ఆహారము మాని అనేక కాయ క్లేశములను సహించి తపస్సుచే సెను. కాని జ్ఞానోదయము కాలేదు. అంతట అతడు భయమును, భోగవాంఛను జయించి మనస్సును నిగ్రహించెను. కాని సమాధి సిద్ధింపలేదు ఈ సమాధి ప్రాప్త్యభావమునకు కారణము తాను ఆహా రమును మాని కాయక్లేశము సహించుటయని తలంచెను. అతడు మరల ఆహారమును భుజించుటకు ఉద్యమించెను.. అంతటితో శిష్యులయిన సన్యాసులు అతనిని విడిచి పోయిరి. క్షుధార్తుడయిన అతడు సుజాతయను నొక వణిక్పంగవుని కుమా రె యిచ్చిన పాయసాన్నము తిని స్వస్థపడెను. పిదప సమాధి స్థితిని పొందనిదే అచటి నుండి పద చలనము చేయ రాదను దృఢనిశ్చయముతో అతడు ఒక వృక్షముక్రింద పద్మాసన స్థితుడయ్యెను. అది వైశాఖ పూర్ణిమానిశి. అప్పు డాతని వయస్సు 35 సంవత్సరములు.

సిద్ధార్థుడు క్రమముగా నాలుగు విధములైన ధ్యానా వస్థలను దాటి ప్రశాంతమైన ధ్యానమునందు నిమగ్ను డాయెను. ఇట్లు ధ్యానస్థితుడయిన అతనికి తన పూర్వ జన్మములు, తత్కారణములు అన్నియు గోచరించెను. ధ్యానము క్రమముగా గాఢతరముకాగా, సమాధి ప్రాప్తి క ల్గెను. సమాధిప్రాప్తిచే ఆజ్ఞానము నశించి జ్ఞానోదయము అయ్యెను. అతడు బుద్ధు డాయెను. బుద్ధత్వమునకు కారణ మయిన ఆ ఆశ్వత్థ వృక్షము క్రిందనే ఆతడు వారము దినము లుండెను. ఆ అశ్వత్థ వృక్షము బోధివృక్షముగా

బుద్ధుడు తాను కనుగొనిన ధర్మములను మానవులందరి కినిబోధించుటకు నిశ్చయించుకొనెను. అతడు కాశీ పురము నకు పోయెను. అచ్చట ఇశిపట్టణము అనుచోట (సార నాథము) ఒక తోటయందు పూర్వశిష్యులగు ఐదుగురను జూచెను. వారును అతనితో మైత్రిగావించిరి అంత బుద్ధుడు తనకు కలిగిన జ్ఞానోదయమును గూర్చి వారికి తెలిపెను. వారును మిక్కిలి సంతసించిరి.

ఆషాఢశుద్ధ పౌర్ణమినాటి రాత్రి అతడు ఆతోటయందు తన మిత్రులకు ప్రథమబోధ గావించెను “మోక్షమార్గము ఇంద్రియార్థ సేవనమందుగాని, శరీర శోషణమందుగాని లేదు, ఈ రెండింటికిని మధ్యమార్గమే ఉత్తమము. అదియే మధ్యేమార్గము" ఇది ప్రథమబోధన సారాంశము. పిదప అతడు నాల్గు దివ్యసత్యములను ప్రతిపాదించెను. అవి (1) ప్రపంచము దుఃఖభూయిష్ఠము. (2) ఈ దుఃఖమునకు కారణము కలదు. (3) ఈ దుఃఖమును నివారింపవలెను. (4) ఈ దుఃఖమును నివారించుటకు ఉపాయము అష్టాంగ సాధనావిధానము అనునది. ఆ సన్యాసులకు నాయకు డైన కొండవ ఈ యుపదేశములు అంతరార్థము గ్రహించి బుద్ధుని ప్రథమశిష్యుడాయెను. తరువాత మిగిలిన నలువురు గూడ బుద్ధునిచే ఉపదిష్టమయినట్టి ధర్మమును గ్రహించి ఆతనికి శిష్యులైరి. పిదప బుద్ధుడు తన ద్వితీయోపదేశ మును చేసెను. ఆ

కాలక్రమమున బుద్ధుని శిష్యసంఖ్య పెరిగెను. మానవ జాతికి ఈ ధర్మమును బోధించుటకై బుద్ధుడు తన శిష్యు లను నలుమూలలకు పంపెను. తాను తిరిగి ఉరు వేలకు వచ్చుచు మార్గమధ్యమున ముప్పదిమంది యువకులను జూచెను. వారచట తమ భార్యలతో సరససల్లాపములు చేయుచుండిరి. వారిలో ఒకనికి భార్య లేకుండుటచే అతడు ఒక స్త్రీని తనవెంట గొనివచ్చెను. ఆమె అచటి వస్తువులను అపహరించి పారిపోయెను. ఆమెకై వెదకుచు ఆ యువకుడు బుద్ధునిజూచి ఆమె జాడను గూర్చి ప్రశ్నిం చెను. అందులకు బుద్ధుడు "ఓయీ ! ఆ స్త్రీకొరకు వెద కుట నీకు శ్రేయస్కరమో, ఆత్మకొరకు వెదకుట నీకు శ్రేయస్కరమో నీవే నిశ్చయించుకొనుము" అనెను. అందుల కాతడు సిగ్గుపడి వెడలిపోయెను. బుద్ధుడు ప్రప్రథమమున ఆత్మనుగూర్చి ప్రసంగించినది ఇచ్చటనే.

ఉరువేలయందు బుద్ధుడు కశ్యపుడను అగ్ని దేవ తారాధకుని గలిసెను. అతనికి అగ్నినిగూర్చి ఇట్లు ఉపదేశించెను. "అన్నియు అగ్నిచే మండుచున్నవి. కామ క్రోధము లనెడు అగ్నిచే సర్వమును అగ్నిమయమగు చున్నవి. వీనిచే ఇంద్రియములును అగ్నిమయములగు చున్నవి. కావున బుద్ధిమంతుడయినవాడు ఇంద్రియ సుఖములందు వై రాగ్యమును, కోరికల విషయమున ఏవగింపును అలవరచుకొనినచో, హృదయమునందలి బాధకు గల కారణములను తీసివేసినవా డగును." అంతట కశ్యపుడుకూడ తన శిష్యులతో బుద్ధునికి శిష్యుడాయెను.

పిమ్మట అటనుండి బుద్దుడు రాజగృహమను పట్టణ