Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోలకొండ పట్టణము సంగ్రహ ఆంధ్ర


ఈ గుంబదలకు కలదు. సమీపమున 'షాహీ హమామ్' గోలకొండలో చనిపోయినవారి శవములను బంజారా దర్వాజా ద్వారా కార్వానుసరాయి ప్రాంత మున గల యీ స్నాన భవనమునకు తెచ్చెడివారు. ఇచ్చట చక్కగ నిర్మింపబడిన అరుగులపై శవములనుంచి స్నానము చేయించి, మత సంప్రదాయము ననుసరించి అన్ని కార్యకలాపములు పూర్తిచేసెడివారు. గదుల పై భాగమున హవుజులలో నీటిని వేడిచేయుటకు, అక్కడి నుండి గదులకు ప్రత్యేకపు నీటి గొట్టముల ద్వారా వేడి నీటి నందించుటకు చక్కని సౌకర్యములుండెను. చల్లని నీటి నందిచ్చుటకై ప్రత్యేకపు గొట్టములుండెను. స్నాన ములు చేయించు గదులు నేటికిని చెక్కు చెదరక యున్నవి. ఇక్కడికి వచ్చువారు పాదరక్షలను వదలి పెట్టుటకు ప్రత్యేక స్థానము కలదు. శవములను ఇక్కడినుండి సమా ధికి తీసికొనివెళ్ళి సమాధి చేసెడివారు. గోలకొండ రాజ్యస్థాపకుడగు కులీ సమాధి గుంబదు నిరాడంబర ముగ నున్నది, గోరీ తలపై ఖురాను భాగములు వ్రాయ బడినవి. ఇతడు 1543 సం॥రమున తన కుమారునిచే వధింప బడెను. ఈ సమాధిప్రక్క 21 సమాధులున్నవి. ఇవన్నియు ఆతని బంధువులవై యుండును.

క్రీ. శ. 1580 సం. జూను రెండవ తేదినాడు చని పోయిన ఇబ్రహీం కుతుబుషా సమాధి గుంబదు పై భాగ మున గోడలపై రంగుపూతలు చెక్కు చెదరక యున్నవి. ఇతని సమాధియొద్ద ఇతని బంధువుల 16 సమాధులు కూడ నున్నవి.

క్రీ. శ. 1608లో భాగ్యమతి చనిపోయినది. 17 వ డిసెంబరు 1611 సం॥లో మహమ్మద్ కులీ మరణించెను. ఇరువురికి సమాధులు గలవు. మహమ్మద్ కులీ గుంబదు గోలకొండ సుల్తానుల గుంబదులలో సుంద రాతిసుందర మైనది. దీని శిల్పనిర్మాణ నైపుణి వర్ణనాతీతము. విశాల మైన రెండు అరుగులు ఒకదానిపై మరొకటి కలవు. క్రింది అరుగు 200 చ, ఆడుగుల వైశాల్యము కలది. పై అరుగు 120 చ. అడుగుల వైశాల్యము కలదిగ నున్నది. దీనిపై 180 అడుగుల ఎత్తు గుంబదు నిర్మింప బడినది. ఇది గ్రెనైటు రాళ్ళతో అందముగ నుండును. గుంబదులో పల మహమ్మద్ కులీ నల్లరాతి సమాధి కలదు.

విశాలములైన ఈ గుంబదు అరుగులపై బ్రిటిషు ప్రభు త్వమువారి కాలమున విందులు జరిగెడివి. ఇపుడు ప్రతి సంవత్సరము 11 జనవరినాడు మహమ్మదు కులీ స్మృతి చిహ్నముగ వైభవముతో ఉత్సవములు చేయబడుచున్నవి. మహమ్మద్ కుతుబుషా సమాధి సమీపమున ఇతని ప్రియు రాలు తారామతి సమాధియు, ఇతని కుమారుని ప్రియు రాలు ప్రేమామతి సమాధియు క లవు.

ఇబ్రహీం గుంబదు సమీపమున గోలకొండ సైన్యాధి పతి నేక్ నాంఖాన్ సమాధికలదు. ఇతడు 1763 సం. మార్చి 30 వ తేదినాడు చనిపోయెను. ఈ గుంబదులో గల సమాధిరాతిపై శాసనమొకటి కలదు. గోలకొండ సమీపమునగల మంగళారము అను పల్లెయొక్క రెవెన్యూ ఆదాయము, ఈ సమాధివద్ద ఖురాను చదువు వారికి, సమాధి దగ్గర రేపగలు ఉండి కార్యకలాపములు నిర్వ హించువారికి, సమాధిదగ్గర దీపములు వెలిగించుటకు, వినియోగింపవలయునని శాసన భావము. ఇంకను కొన్ని గుంబదులు కలవు.

1645-53 ప్రాంతమున గోలకొండను దర్శించిన టెవర్నియరు అను పాశ్చాత్యుడు ఈ గుంబదులను జూచి ముగ్ధుడై పోయెను. సాయంకాలము ఆరుగంటల సమయ మున ఈగుంబదులకు వచ్చిపోవువారికి రొట్టెలు, పులావు పంచి పెట్టుచుండిరని టెర్నియరు వ్రాతలవలన తెలియు చున్నది. విలువగల జంపుఖానాలు ఈగుంబదు ప్రాంత మున ఎల్లప్పుడును పరచి ఉంచెడివారట. తానాషా కాలములో జరిగిన ఔరంగజేబు ముట్టడి వలన గోలకొండ మొగలు సైన్యములకు వశమైనది. 'లారీ' వంటి స్వామిభ క్తులు, దేశాభిమానముగల వీరులు, కొందరుండి యున్నచో గోలకొండ దుర్గము శత్రు హ స్తగతము కాకుండెడిది. గోలకొండ కోటలోనికి శత్రు సైన్యము వచ్చునపుడు ఒక కుక్క మొరిగి స్థానిక సైన్య మును మేల్కొల్పినదట. దానికి 'ఫెరోజ్ జంగ్ ' అను బిరుదు నిచ్చిరి. దాని కంఠమును బంగరుపట్టాతో అలంక రించిరి. వీరుల దేశాభిమానమున కిది చిహ్న ప్రాయము. కోటద్వారములు తెరచిన స్వామిద్రోహి అబ్దుల్లా ఖానును గోలకొండ ప్రజ లెన్నడును విస్మరింపలేదు. మొగలు వారు సమర్పించిన ధనరాసులకు దాసులై వారి సైన్యములో