Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గోదావరినది -2

గోదావరీ నదీ ప్రవాహ ప్రాంతములో ఎక్కువ భాగము నైరృతి (జూన్-సెప్టెంబరు) ఋతుపవనముల కాలములో గరిష్ఠ వర్షపాతమును, ఈశాన్య ఋతుపవనముల కాలములో కొద్ది వర్షపాతమును పొందును. తత్పర్యవసానముగ గోదావరీనది, జూన్-సెప్టెంబరు నెలలనడుమ తననీటిలో అత్యధికభాగము గ్రహింప గలుగుచున్నది. సామాన్యముగా వరదల ఉధృతము సెప్టెంబరు మాసములోను, సకృత్తుగా అక్టోబరులోను సంభవించును. ఈశాన్య ఋతుపవనముల కాలము ముగియుట తోడనే గోదావరీనది 2,107,660 క్యూసెక్కుల (cusecs) గరిష్ఠ ప్రవాహమునుండి 5,100 క్యూసెక్కుల కనిష్ఠ ప్రవాహమువరకు క్రమముగా తగ్గుచు పోవును. (ధవళేశ్వరమువద్ద వర్షేతరకాలపు సగటు ప్రవాహమును పరిశీలింపగా తేలిన ఫలితము). గోదావరినదిలో చేరు ఉపనదుల పట్టిక ఈ దిగువన ఉదాహరింపబడినది. ఈ ఉపనదుల పేళ్ళకు ఎదురుగా వాటి అరగాణి విస్తీర్ణమును, ప్రధానమైన తల్లినదికి వాటియొక్క ఉపనదులు సేకరించిపెట్టు జలపరిమాణమును పేర్కొనబడ్డవి —

వరుస సంఖ్య ఉపనది పేరు ఆరగాణి విస్తీర్ణము చ. మైళ్ళు సేకరణ జలము
1. శివనా 1,050 -
2. పూర్ణ 6,100 -
3. ప్రవర 6,575 -
4. సింధుఫనా 1,490 -
5. మంజీర 11,700 5%
6. మానేరు 1,565 -
7. పెనుగంగ 17,300 -
8. వార్ధా మరియు ప్రాణహిత 22,800 40%
9. ఇంద్రావతి 15,700 20%
10. శబరి 7,500 10%
11. ఇతరములు 8,500 -
12. ప్రధానమైన గోదావరీనది 20,086 -

ఈ ఉపనదు లన్నిటియొక్క మూలమున గోదావరీ నది బ్రహ్మాండముగా ప్రవర్ధిల్లినది. గోదావరీ నదీజలములను ఇంతవరకు దాదాపు వినియోగింప లేదనియే చెప్పవచ్చును. ధవళేశ్వరమువద్ద నిర్మింపబడిన ఆనకట్ట మూలమున నూటికి 6 నుండి 8 వంతులవరకును, ఈ శతాబ్దారంభమున (1911 నుండి 1931 వరకు) నదికి ఎగువ భాగమున నిర్మింపబడిన ప్రాజెక్టుల మూలమున నూటికి 5 వంతుల వరకును మాత్రమే గోదావరీ జలము వినియోగములోనికి వచ్చుచున్నది. ఏడాదికి 18,500 లక్షల ఘనపు టడుగుల అమూల్య జలము ఈ లోయగుండా ప్రవహించుచు, అదుపులో లేకయు, వినియోగపడకయు, వ్యర్థముగా బంగాళాఖాతమున కలియుచున్నది.

ఈ లోయయందు ప్రస్తుతము పనిచేయుచున్న ప్రాజెక్టుల వివరములు, వాటియొక్క శక్తిపాటవములు ఈ క్రింద ఉదాహరింపబడినవి :

వరుస సంఖ్య ప్రాజెక్టు పేరు. నికరపు పెట్టుబడి వ్యయము రూపాయలలో. సాగయ్యెడి భూమి వైశాల్యము
1. వాఘా ఆనకట్ట 6,83,800 4,581
2. దార్నా ఆనకట్ట 34,27,465 60,442
3. రామ్‌తక్ ఆనకట్ట 12,62,986 14,895
4. ఖైరాబంద్ ఆనకట్ట 1,96,597 5,702
5. చందాపూర్ ఆనకట్ట 2,01,200 10,891
6. ఆసోలామెంథ్ ఆనకట్ట 6,01,211 24,500
7. జూనానయా ఆనకట్ట 2,89,695 5,858
8. ఘోర్ ఝేరి ఆనకట్ట 1,79,841 4,308
9. సారథి ఆనకట్ట 4,78,778 8,995
10. చరభోమర ఆనకట్ట 4,17,068 6,690
11. బడల్ కసా ఆనకట్ట 1,63,164 6,869
12. విల్సన్ ఆనకట్ట 84,14,188 55,934
13. రాయనపల్లి ఆనకట్ట 3,17,531 1,250
14. బోరి ఆనకట్ట 10,67,262 6,312
15. నిజాంసాగర్ ఆనకట్ట 2,18,48,000 2,75,000
16. ధవళేశ్వరము ఆనకట్ట 2,20,00,000 11,30,500
17. మానేరు ఆనకట్ట 9,77,000 17,250

ప్రప్రథమముగా, అవిభక్త మద్రాసు రాష్ట్రప్రభుత్వ కాలములో గోదావరినదిపై, ధవళేశ్వరముయొద్ద 1857 సం॥లో ఒక పెద్ద ఆనకట్ట నిర్మింపబడినది. ఈ ఆనకట్ట

451