Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుహావాస్తువు

సంగ్రహ ఆంధ్ర

ద్వారము అమర్పబడుటచే అవి కలిసిపోయినవి. దక్షిణదిశ యందు అనగా ఎడమప్రక్కనగల చావడి 191/2 చతురపు టడుగుల వైశాల్యము కలిగియున్నది. దీని పైకప్పు, ముందుభాగమున నున్న రెండు మామూలు స్తంభముల మీదను, లోపలనున్న రెండుస్తంభములమీదను ఆధారపడి యున్నది. ఈ స్తంభచూళికలపై సాలభంజికలు చెక్కబడి యున్నవి. వెనుకభాగమున పది చ. అడుగల విస్తీర్ణము గల ఒక దేవాయతనము కలదు. అందొక వేదికగలదు. ఈ చావడియొక్క ముందుభాగమును ఎక్కుటకు 101/2 అడుగుల వెడల్పుగల ఒక వేదికపైనుండి 8 మెట్లు కలవు. ఈ వేదికయొక్క ఎడమ చివరకు వెలుపలిభాగమున, 61/2 అడుగుల పొడవును, 41/2 అడుగుల వెడల్పును గల యొక గది కలదు. దానికి వెనుక భాగమున 3 అడుగుల పొడవును 2 అడుగుల వెడల్పును గల మరియొక చిన్నగది యున్నది. పై నున్న రాతిబండ మీద ఏనుగులు, సింహములు చెక్కబడిన ఒక భిత్తితక్షణ చిత్రము కలదు. చిన్నగది మీది ముఖభాగమందు బాతులు చెక్కబడిన భిత్తితక్షణ చిత్ర మొకటి యున్నది. దీని పైభాగమున చైత్యగవాక్ష మలంకారముగానున్నది. ముందునకు ఉబుకుచున్న యొకభాగము కలదు. దానిమీద ముందున కుబికియున్న 5 గ్రంధుల వరుస యొకటి గోచరించును. ఇవి గుర్తించుటకు వీలులేనంతగా వాతాహతములై యున్నవి. మరల దానిపై సమతలమున జాగ్రత్తతో చెక్కబడిన చిత్రదుకూలధారణ విధానమొకటి కనిపించును. వేదికకు ఉత్తర దిశగానున్న రాతిబండమీద శా. శ. 13 వ శతాబ్దినాటి సుదీర్ఘ శాసన మొకటి తెలుగు భాషలో కన్పడుచున్నది. ఈ శాసన మందు దేవాలయమునకు చేయబడిన యొక ధర్మమును గూర్చి తెలుపబడినది. ఆ కాలము నందు గూడ ఈ దేవాలయము నెడ ఎట్టి అత్యున్నతమైన గౌరవప్రపత్తు లుండెడివో ఈ శాసనలిఖితము సూచించు చున్నది. దీనికి కుడివైపున 10 అడుగుల దూరమున 29 అ. 9 అం. పొడవును, 13 అ. వెడల్పును 8 అడుగుల ఎత్తును గల ఒక పెద్ద మండపమున్నది. పైకప్పు భారమును వహించుచు 16 స్తంభములు కలవు. ఈ 16 స్తంభములు ఒక్కొక వరుసలో నాలుగేసి చొప్పున సమాంతరమున నున్నవి. ఈ మండపము దాటగానే, 131/2 చ. అడుగుల వైశాల్యముగల దేవాయతనము కలదు. అందు దేవతావిగ్రహ ప్రతిష్ఠార్థము నిర్మితమై శూన్యముగనున్న ఒక వేదిక గలదు. ఈ దేవాయతన ప్రవేశద్వారముయొక్క ఉభయపార్శ్వముల యందు నిలుచుండియున్న రెండు విగ్రహములు కలవు. ఈ రెండింటిలో ఒకటి నిస్సందేహముగా నరసింహస్వామియే. ఈ విగ్రహముయొక్క శిరోభాగముపై మకరతోరణ మొకటి కలదు. అచట హిందూదేవతాగణమంతయు సర్వలక్షణసమన్వితముగ రూపొందియున్నది. విశాలమయిన చావడికి ఎడమ ప్రక్కననున్న మెట్ల పంక్తి పైమూడవ అంతస్తునకు గొంపోయి ఒక పెద్ద చావడిలోనికి చేర్చును. ఈ చావడి వరండాతోసహా 52 అ. 9 అం. పొడవును, 30 అ. 3 అం. వెడల్పు కలిగియున్నది. వసారాకు స్తంభములున్నవి. లోపలి భాగముననున్న చావడి యెత్తు 8 అడుగులు. వరుసకు 6 స్తంభముల చొప్పున, దానియందు రెండు వరుసలున్నవి. ఈ స్తంభములు స్థూలములై చతుష్కోణాకారము కలవి. స్తంభముల మధ్య భాగమున కొలదిగ అష్టముఖాకారములు కలవిగా నుండునట్లు చెక్కబడియున్నవి. ఇచ్చట గూడ హిందూ దేవతాశిల్ప రూపములు గోచరించును. దక్షిణ దిశగానున్న మెట్ల పంక్తిని ఎక్కిపోయినచో పై అంతస్తునకు చేరుకొన గలము. ఈ చివరి అంతస్తు కలశాకారములో నిర్మింప బడినది. ద్రవిడ కళాసంప్రదాయాను సారము సూచ్యగ్రస్తూపాకారములో నుండు చౌకమైన ప్రతిదేవాలయమును కలశా కారమున తీర్చి దిద్దబడినవి. ఉండవల్లి గుహాలయమును పరిశీలించినచో ఏతన్నిర్మాతలు వాస్తు, శిల్ప ఖండములను చెక్కు కౌశల్యమును బౌద్ధులనుండి అనగా ప్రాచీన హిందువులనుండి నేర్చిరని తేటపడగలదు.

సముద్రతీరమున మదరాసునకు దక్షిణముగా 35 మైళ్ల దూరముననున్న మహాబలిపురమునందు 7 దేవాలయము (పెగోడా) లున్నవి. ఇవి విశిష్ట నిర్మాణములు. గుహావాస్తు శిల్పసంపదయందు వీటినిగూడ చేర్పదగును. సాధారణముగా గుహయొక్క వెనుకభాగము ప్రతిమా ప్రలంబ శిల్పమునందువలె మూసివేయబడి యుండును. అయితే చుట్టునున్న శిల్పవిన్యాసమంతయు ఒకే శిలాఖండమునుండియే మలచబడినది. ఈ పెగోడాలు, లేక

416