Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 8 399 గురుత్వాకర్షణము

స్థితినుండి ప్రక్కలకు మరలుచుండుటను వారు పరిశీ లించిరి.

మాస్కెలిన్ ప్రయోగమును బట్టి 'G' అను దాని విలువ 7.4 x 10 – C. G. S. యూనిట్లని తేలెను. 1854లో ఎయిరీ అనునాతడు భూతలము పైనను, గనిగొయ్యి (mine shaft) అడుగు పైనను గల ఆకర్షణశక్తి (gravity) వలన ఏర్పడిన త్వరణము (accelera- tion) ను నిర్ణయించెను. గనియొక్క అడుగునను, పై భాగమునను గల లోలకము (pendulum) యొక్క ఊపు (oscillation) యందలి అవధులను పరిశీలించుట వలన పై నిర్ణయము చేయగలి గెను 1798 లో పరిశోధన శాలలో కావెండిష్ అనునాతనిచే మొదటిసారిగా 'G' యొక్క కచ్చితమైన నిర్ణయము చేయబడెను. ఈ నిర్ణ యము అతడు తంత్రీబలమానము (torsion balance) యొక్క సాయముతో చేసెను. ఆ తంత్రీబలమానము నందు రెండు సీసపుగుండ్లు జంటలయొక్క పరస్పరాకర్ష ణముచే జనించిన 'కపుల్' (couple) ఒక తీగ యొక్క నులుపునట్టి (torsional) ప్రతిక్రియవలన గలిగి, పూర్వ స్థితికి తెచ్చునట్లు 'కపుల్' ను విఘాతము చేయున . 'G' అనగా 6.562×10 ' యూనిట్లని అతడు కనుగొనగల్గెను. 1895 లో ప్రొఫెసర్ బాయిస్ అనునాతడు ఎక్కువ ఖచ్చితమైన ప్రయోగ మొనర్చెను. అం దాతడు గొప్ప స్థితిస్థాపక గుణముగల (elastic) సన్నని (0.0125 మిల్లి మీటరు వ్యాసముగల) శిలా స్ఫటికపు నారపోగులను ఉపయోగింప గలిగెను. దాని ఫలితముగా చిన్న కపుల్ (couple) యొక్క వ్యావృత్తి (deflection) గూడ అతడు కనుగొనెను. అతనికి 'G' అనగా 6.658 × 10– C. G. S. యూనిట్లని అతడు కను గొనెను. పాయింటింగ్ (Poynting) అను నాతడు 1893 లో 'G' యొక్క విలువను నిర్ణయించెను. ఇందా తనికి ఒక సున్నిత మైన మామూలు త్రాసుమాత్రమే తోడ్ప డెను. అందులో త్రాసుయొక్క సూచకపు (pointer) వ్యావృత్తులు (deflections) అనువైన అద్దము చే 150 రెట్లు విస్తృత మొనర్పబడెను (magnified). 'G' ని కచ్చితముగా నిర్ణయించు తలంపుతో 1930 లో పాయెల్ (Heyel) అను నాతడొక ప్రసిద్ధమైన ప్రయోగ మొనర్చెను. అందులో సమతలమున నున్న కేంద్రములతో వ్రేలాడు సమానములగు రెండు చిన్న గోళముల (spheres) నిర్మాణముగల తంత్రీబలమానము (torsion- balance) యొక్క. వ్రేలాడు పద్ధతి గురుత్వాకర్షణ విష యక క్షేత్రములో చిన్న ఊపులను (oscillations) కల్గించునట్లు చేయబడెను. ఆ క్షేత్రము రెండు పెద్దరాసు లకు సంబంధించినది. ఆరాసులు ఆకర్షణ క్షేత్రములు కూడ ఆ మట్టముననే ఉండును. ఊపు (swing) ఆరంభ కాలమునుండి 'G' 6.669 × 10 – C. G. S. యూనిట్లు ఉండునట్లు లెక్కకట్టబడినది . గురుత్వాకర్షణ ధర్మములు : గురుత్వాకర్షణము, ఆకర్షించుపదార్థ రాసులపైనను, వాటిమధ్యయందు గల దూరముల పై నను ఆధారపడి యున్నట్లు క నుగొనబడినది. ఇంతవరకు భిన్నభిన్న పరిస్థితులలో 'g' యొక్క భేదము లను అధ్యయన మొనర్చుటకై కావింపబడిన అన్ని ప్రయోగములయందును వ్యతి రేక పరిణామములు లబ్ధము లయ్యెను. గురుత్వాకర్షణశక్తి విద్యుదయస్కాంతశక్తుల వలె గాక, నడుమనున్న పదార్థముల (intervening- mediums) స్వభావముపై ఆధారపడక స్వతంత్రముగ నుండును. 186-250° మధ్యనున్న ఉష్ణోగ్రతవలన ఆకర్షణ శ క్తి మార్పుచెందదని పాయింటింగ్ చూపించియున్నాడు. యువోట్వోస్ (Evotvos) అను నాతని యొక్క యు, ఇతరులయొక్కయు గ్రంథములు, తంత్రీబలమాన సహాయ మున (torsion balance) ప్రాయోగిక స్థాలిత్యము యొక్క హద్దులలో 'g' అనునది రాసుల స్వభావము తోను, వాటి రాసాయనిక సంయోగ స్థితితోను సంబం ధము కలది కాదని చూపినవి. అనేక స్ఫాటిక పదార్థము లలో వాటియొక్క భిన్న దశలనుబట్టి భౌతిక ధర్మములు భిన్నములగుచున్నవి. స్ఫటిక ములతో జరుపబడిన ప్రయోగ ముల వలన 'g' యొక్క విలువ స్ఫటికాక్షము (axis of the crystals) మీద గూడ ఆధార పడదని విదితమగు చున్నది.

ఐన్ స్టెన్ కనిపెట్టిన గురుత్వాకర్షణ_జడత్వముల సమత్వ సూత్రము : గురుత్వాకర్షణము - జడత్వము (inertia) గురుత్వా నకు అనుగుణముగ నుండునను విషయము కర్షణము యొక్క విశేషగుణము (అనగా విశ్రాంతి