విజ్ఞానకోశము - 3
గుజరాతుదేశచరిత్రము
గూర్చి కొంత విచారింతము. 'కఛ్' భారతదేశమునకు పశ్చిమమున నున్నది. ఈ ప్రాంతపు చరిత్ర అతి ప్రాచీనమైనది. ఈజిప్టు దేశ చరిత్ర ఎంతటి ప్రాచీనమైనదో, ఇది కూడ అంతటి ప్రాచీనమైనదే. ప్రాచీనకాలమున “సమో " వంశమను రాజవంశ ముండెను. 'మహేంద్ర' అను రాజుయొక్క పౌత్రుడు 'సమాపత్' అనునాతడు, ఈ పేరునుండియే 'సమో' యను పదము వచ్చినది. ఈ వంశమునకు జెందిన 'లాభాదురారా' అను రాజునకు మానాయి, మోడ్ అను నిరువురు పుత్రులు గలరు. ఈ ప్రాంతమును సంపూర్ణముగా వీరు వశపరచుకొనిరి. 9 వ శతాబ్దము వరకు వీరి వంశజులు, ఈ ప్రాంతమును పరిపాలించిరి. క్రీ. శ. 1007 నుండి 1143 వరకు చావడా వంశమునకు జెందిన పదునెనిమిదిమంది రాజులు ఇచ్చట పరిపాలించిరి. తరువాత విక్రమశకము 16 వ శతాబ్ది మధ్య భాగము వరకు ఈ ప్రాంతమున అశాంతి ప్రబలెను.
క్రీ. శ. 1510 లో 'భెంగార్ ' అనునతడు అశాంతిని రూపుమాపి దానిని శాంతియుత రాజ్యముగా మార్చెను. తరువాత అంజారు, భూజా, మాండవీ వంశజులు పాలించిరి. వీరి వంశముల పేర్లతో 1546 సం. లో అంజారు, 1549 సం. లో భూజా, 1580 సం. లో మాండవీ అను పేర్లు గల పట్టణములను నెలకొల్పిరి. ఈ ప్రాంతమును 400 సంవత్సరములలో 15 రాజవంశములు పాలించెను.
ఈ ప్రాంతము 150 సం. లకు పూర్వము భూకంపము వలన చాల నష్టపడెను. ఈ ప్రాంతము సముద్రతీరమున నుండుటచే లభ్‌పత్, కోటేశ్వర, జాభే, మాండవీ, ముంద్రాతుణా, కండలా, భారీరోహర్ అను పేర్లు గల చిన్న రేవుపట్టణములు పెక్కులు వెలసెను. ఈ ప్రాంతము ఎనిమిది తాలూకాలుగా నున్నది. ప్రాంత మధ్యమున భూజా ; దక్షిణమున మాండవీ, ముంద్రా, అంజారు ; తూర్పున రాఫర్, భచావు; పశ్చిమమున లభ్‌పత్, అవడాసా అను తాలూకాలు గలవు. ఇచటి జనసంఖ్య 5,00,000. భూజా, మాండవీ ముంద్రా, అంజారుల యందు కోటలు గలవు. అంజార్ నందలి కోట భూకంపము వలన నేలపాలై పోయినది. మిగిలినవి నేటికిని శిథిలావస్థలో నున్నవి. ఈ ప్రాంతము చిన్నదైనను ఇందు నదులు, అడవులు, పర్వతములు, ఇసుక మైదానములు, గడ్డిబీళ్ళును చాల కలవు. ఇది చూచుట కెంతో ఆకర్షవంతముగా నుండును. ఇచ్చటివారి నాగరికత అతిప్రాచీనమైనది. నాటినుండి నేటివరకు వారి నాగరికత యందు ఎక్కువ మార్పులు రాలేదని చరిత్రకారులు చెప్పుదురు. భారత స్వాతంత్ర్యమునకు పూర్వము ఇచ్చటి రాజులను 'మహారాజులు' అనుచుండెడివారు. ఇవి మొగలు లొసంగిన బిరుదులట ; 'రాజ, మహారాజ, మీర్‌ఝా' అనునవి కూడ రాజబిరుదములు. ప్రజలు ఆ బిరుదులచే ఆ రాజులను పిలుచుచుండిరి. జహంగీరు కాలమున నీ ప్రాంతమును 'రాజశ్రీ భారమల్లు' అనునతడు పాలించుచుండెను. ఇతడు మహావీరుడు ; మంచి ప్రతిభ గలవాడు. జహంగీరు ఈతనికి స్వంత నాణ్యములు చెలామణి చేసికొనుటకు అనుమతి నొసగెను. రాజశ్రీ భారమల్లు మహాదేవనాకుమీ అనుచోట టంకశాలను స్థాపించి బంగారు, వెండి నాణెములను తయారు చేయించెను. 'కోరీ, పాంచియో, అరధియో' యను పేర్లుగల నాణెములు తయారు చేయించి చెలామణి చేసెను.
ఈ ప్రాంతమున విద్యావ్యాప్తి గావించినవాడు మహా రాజశ్రీ దేశల్‌జీ (క్రీ. శ, 1851) 'ప్రామగల్లు' రాజు పాలనములో విద్య సవ్యమైన బోధనాపద్ధతులతో నడచెను. ప్రస్తుతదశలో 'భూజ్' యనుచోట నొక కళాశాల కలదు. ఇచటి ముఖ్య సాహిత్యకారులు నారాయణ్ విసన్‌జీ, ఠక్కుర్, దులేరాయ్, కారాణీ, డుంగరశీ, ధరమశీ, సంపత్, మొదలగు వారలు. ముఖ్య పండితులు కర్మవీర్, వ్యాపారీ అనువారలు. కఛ్ భాషకు మొదట లిపి లేదనియు, దానికి సింధీ భాషతో సంబంధము గలదనియు భాషా శాస్త్రవేత్తల అభిప్రాయము. ఈ ప్రాంతమునకు రాజధాని 'భూజ్'.
ఇచటి స్త్రీల వస్త్రాభరణములు మార్వాడీ స్త్రీల వస్త్రాభరణములను పోలియుండును. విద్యతక్కువగుటచే వీరి యందు అజ్ఞానము మెండు. పురుషులకు కూడ స్త్రీ విద్య యందు ఎక్కువగా శ్రద్ధలేకపోవుటయే వారిలో అజ్ఞానము పెంపొందుటకు కారణము. కాని వారి హృదయము నవనీత తుల్యమైనది; భగవద్భక్తి మెండు. ఇచట ఆడపిల్లలను విక్రయించుట, భార్య యుండగా మరియొక భార్యను చేసికొనుట, మున్నగు దురాచారములు నేటికిని
383