Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటుపల్లి

సంగ్రహ ఆంధ్ర

శిలాచైత్యమున్నది. దీనిచుట్టును ప్రదక్షిణపథము గలదు. చైత్యవేదికయొక్క వ్యాసము 11 అడుగుల 8 అంగుళములు. దీనిఎత్తు 3 అడుగుల 9 అంగుళములు. దీనిపైన 9 అడుగుల 2 అంగుళముల వ్యాసమును, 4 అడుగుల 9 అంగుళములు ఎత్తునుగల 'అండ' మొకటి కలదు. అండముపైన హర్మికలో ఛత్రపుకాడను దించుటకు అనుకూలముగా నుండునట్టి ఒక గుంట యున్నది. ఈ గుహాలయము పైకప్పు చేజెర్ల కపోతేశ్వరాలయపు పైకప్పును పోలి యున్నది. గుహాముఖము ఒక పెద్ద గుఱ్ఱపులాడపు ఆకారముతో నున్నది. అంతేగాక గయవద్ద గల 'బారాబరు' కొండలలోని 'లోమక ' ఋషి గుహాముఖము వలెనే దీని ముఖముగూడ నున్నది. దానియందలి లోపలి కొలతలతో దీనియందలి లోపలి కొలతలు సమానముగ నున్నవి. అందుచేత ఈ రెండు గుహలును క్రీ. పూ. రెండు వందల సంవత్సరముల ప్రాంతమున నిర్మింపబడినవని పురాతత్త్వ శాస్త్రజ్ఞులు పరిశోధనలు సల్పి నిర్ణయించియున్నారు.

(2) విహారము : పైన తెల్పిన చైత్యగృహమునుండి ఈ విహారము చేరుటకు ఒక దారియున్నది. ఈ విహారము చైత్యగృహమునకు పైభాగమున ప్రాగుత్తరముగా

చిత్రము - 102

గుంటుపల్లి గుహాలయములు

నుండును. ఇది అడ్డదిడ్డముగా చెక్కబడిన గదులతోను, కంతలతోను నిండియుండును. అంతేగాక ఈ విహారము కార్లి, నాసిక, భేడ్సా మొదలైన మహారాష్ట్ర దేశమందలి విహారములవలె, అంత అందముగాలేదు. గుహకు మధ్యభాగమున ఒక కిటికియు, రెండువైపుల రెండు కిటికీలును, వాటిపైన ద్వారముల పైభాగములయందు చైత్యవాతాయనములును గలవు. ఇతర అలంకారములు లేవు. ఈ విహారమునందు కొన్నిగదులు అసంపూర్ణముగా నిర్మితమైనట్లు కనిపింపగలవు.

(3) వేరొక విహారము : ఈ పెద్ద విహారమునకు సమీపమున పై భాగమందు అయిదు గదులుకల వేరొక విహార మున్నది. కాని ఈ విహారము మిక్కిలి శిథిలావస్థలో నున్నది. ఇది అంత ఆకర్షణీయమయినది కాదు.

II. ఇటుక, రాతి కట్టడములు: పై నుదహరించిన ప్రాచీన గుహావిహార శిథిలములకు సమీపముననే కొన్ని ఇటిక కట్టడములును, రాతి కట్టడములును ఉన్నవి. ఈ కట్టడము లన్నియు ఈ బౌద్ధతీర్థమునకు సంబంధించినవే యైయున్నవి. కాని, కట్టడములన్నియు శిథిలావస్థలో నున్నవి. వీటి నిర్మాణము గుహావిహారములకు తర్వాతి కాలములో జరిగినట్లు చరిత్రకారులు భావించుచున్నారు.

(1) ఇటుక స్తూపములు : చైత్య గుహ నుండి విహారగుహకు పోవు దారిలో కొండచాలుపైన అనేక స్తూపముల యొక్క పునాదులు వరుసగా గానిపించుచున్నవి. వీటి పైభాగములన్నియు శిథిలములైపోయినవి. ఈ ఇటిక స్తూపములు మిక్కిలి చిన్నవి. ఇవిఆరాధ్యస్తూపములని చరిత్రకారులు ఊహించుచున్నారు.

(2) చైత్య గృహము : ఈ చైత్య గృహము, పై స్తూపములకు సమీపమున పడమరవైపుగా నున్నది. ఇది గుఱ్ఱపులాడపు ఆకారముతో నిర్మింపబడియున్నది. దీని పొడవు 54 అడుగుల 5 అంగుళములు ; వెడల్పు 14 అడు

360