Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గానశాహిత్యము

సంగ్రహ ఆంధ్ర

అఠాణకీర్తన :


“బాల కనకమయచేల, సుజనపరిపాల, శ్రీరమా
 లోల, విధృతశరజాల, శుభదకరుణాలవాల, ఘననీల
 నవ్యవనమాలికాభరణ ॥ ఏల నీదయ రాదు ?"

ఆరభికీర్తన :


"శ్రీ వేంకటేశ ! స్వప్రకాశ! సర్వోన్నత! సజ్జన
 మానస నికేతన ! కనకాంబరధర ! లసన్మకరకుండల
 విరాజిత ! హరే! యనుచు నే పొగడగా ! త్యాగ
 రాజగేయుడు ! మానవేంద్రుడైన రామచంద్రుడు
 ॥ సమయానికి॥

కన్నడరాగ కీర్తన :


“ఆశాపాశముల దెగకోసి, యన్నియు మది రోసి,
 కర్మము బాసి, నిను కరుణావారాశియని పూజజేసి,
 దుస్సంగతి జేసి, మేనుగాసి జెందక, శ్రీశ ॥ దేవా
 ధీశ, నిను కాశీశ సుతుడని ఆశనీయెడ నీశ భక్తియు
 జేసినవారి ॥ కిదే భాగ్యముగాక ఏమియున్నది రా "

మరొక కీర్తనములో :

“జనక జామాతవై, జనకజామాతవై
 జనకజాలము చాలుచాలును.”

బేగడకీర్తన :


“జ్యావరనుత ! జ్యాజావర! బిడౌజావరజా! శ్రిత
 త్యాగరాజ ! జ్యావరాజ రుద్రావనీసుర! భావనీయ!
 మునిజీవనానిశము ॥ నీపద పంకజములనే నెర
 నమ్మినాను "

"ఆబోతుకు నటుకులు రుచి తెలియున; తవిటికి రంకాడ బోయిన, కూటి తప్పేల కోతి గొనిపోయినట్లు" ఇట్టి లోకోక్తులు పెక్కులు త్యాగరాజులవారి గాన సాహిత్యమున ఇమిడియున్నవి. రాగతాళగతులకు భంగము కల్గింపని భక్త్యావేశమును, నాటంకపరుపని ఇంపగు సాహిత్యభావములు శ్రీ త్యాగరాజస్వామి కీర్తనములలో నిండియున్నవి.

అధ్యాత్మ రామాయణ కీర్తనల సాహిత్యము మంజుల పద లసితము ; అనుప్రాసాద్యలంకార బంధురము . సంగీత సాహిత్య నిపుణులు గానివారు లయబద్దముగ, రంజకముగ ఈ కీర్తనల గాన మొపర్పలేరు. ఉదా : బాలకాండలో బేగడ రాగమందలి కీర్తనలో ఒక చరణము—విశ్వామిత్ర సహితులై రామలక్ష్మణులు సీతా స్వయంవరమునకు పోయిన వృత్తాంతము —


“రంగదభంగ తరంగ గంగ ను
 ప్పొంగుచు దాటి - విదేహ రాజపురి
 చెంగటరాగ నెరింగి జనకుడు చె
 లంగుచు నెదురుగను
 రంగుగజని గాధేయునకును సా
 ష్టాంగ మెరిగి పూజించి దిశలు వెలు
 గంగజేయు చంద్రసూర్యులో, సుర
 పుంగవులగు నరనారాయణులో,
 శృంగారకళల బంగారుతళుకు ల
 నంగాను తగిన వీర లెవ్వ రె
 రుంగవలయునన, దశరథాత్మజులు
 మంగళకరులీ రామలక్ష్మణులు
 మహాభుజుల్ ఘనులని ముని దెల్పెను
 వినీలవేణి వినుత గుణశ్రేణి.”

మొవ్వగోపాల పదముల రచించిన క్షేత్రయ్య పదముల సాహిత్యము ఇంపుసొంపులతో గూడిన తెలుగు నుడికారములతో ఒప్పారుచున్నది. ఈ పదములు రసమంజరి యను నలంకారశాస్త్రము ననుసరించి నాయికా భేదములకు రసలక్షణములకు లక్ష్యములుగా రచింప బడినవి. ఇంత రసవంతమైన తెనుగుపదముల కూర్పు మరి ఇతర గేయకారుల కవితయందు గానబడదు. నేటి కాలపు భాషా విమర్శకులు ఈ పదములు సాహిత్యమును బహువిధములు కొనియాడిరి. మచ్చున కొక ఉదాహరణము :

యదుకుల కాంభోజి - ఝంపె :


ప. అలిగియుండుట కేమి కారణమో
    తెలిసి నీ వరిగి రాపోవె ఓ భామా !

అ. చెలువ యిదివరలో మొవ్వ గోపాలునికి
    చేసిన యపరాధ మేమో ఓ చెలియ.

చ. 1. అందందు దిరిగి రావలసి వచ్చిన వేళ
       చందురుకావి పసిడంచు సరిగపయ్యెద
       సరవి తడియొత్తగ లేదా
       అంకురము లొదవ సురటిమై చెమటలార్పగ లేదా
       గంధము పునుగు కస్తూరి జవాది

344