Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గానశాస్త్ర చరిత్ర

సంగ్రహ ఆంధ్ర

వరాళి, (4) తోడి, (5) నాదనామక్రియ, (8) భైరవి, (7) వసంత, (8) వసంత భైరవి (9) మాళవగౌళ, (10) రీతిగౌళ, (11) అభేరి, (12) హమ్మీరు, (18) శుద్ధనాట, (14) శుద్ధరామక్రియ, (15) శ్రీరాగము, (16) కల్యాణి, (17) కాంభోజి, (18) మల్లారి, (19) సామంత, (20) కర్ణాటగౌడ, (21) దేశాక్షి, (22) శుద్ధనాట (29) సారంగ అను మేళములు, వీటియందు ప్రచారమునగల 74 రాగములు జన్యములుగ జెప్పబడినవి.

రఘునాథరాయలు : క్రీ.శ. 1614-1633 వరకు తంజావూరు రాష్ట్రము నేలెను. ఈయన తన “సంగీతసుధ” యందు 15 మేళములు, తజ్జన్యములు చెప్పెను. ఇతడు చచ్చత్పుటాది 108 తాళములు పేర్కొనుటను బట్టి అప్పటికి సూళాది తాళము లుండియున్నను పూర్వపద్ధతిని త్యజించనివారు కొందరు కలరని తెలియవలెను. రఘునాథనాయకుని వాల్మీకి చరిత్ర అను ప్రబంధమువలన భరతుని 108 కరణములును, తాండవ, లాస్య, ప్రేంఖన, ప్రేరణ, కుండలీ, నృత్యములును దేశమున ఆ కాలమందు సాగుచుండినట్లు విదితమగును.

ప్రస్తార మేళరాగకాలము (18, 19, 20 శతాబ్దములు) :

వేంకటమఖి : ఈతడు గోవిందదీక్షితుల రెండవ కుమారుడు. “చతుర్దండి ప్రకాశిక" అను సంగీత గ్రంథము రచించెను. ఈతడు (1)చతుశ్శ్రుతి రిషభము, (2) షట్ఛ్రుతి రిషభము, (3) సాధారణ గాంధారము, (4) అంతర గాంథారము, (5) వరాళి మధ్యమము, (6) చతుశ్శ్రుతి ధైవతము, (7) షట్ఛ్రుతి ధైవతము, (8) కైశికి నిషాదము, (9) కాకలి నిషాదము అను తొమ్మిది వికృత స్వరములతో శుద్ధస్వరము లేడింటిని జేర్చి 16 స్వరములు తెలిపెను. కాని చతుశ్శ్రుతి రిషభ శుద్ధగాంధారములు ; షట్ఛ్రుతి రిషభ సాధారణ గాంధారములు; చతుశ్శ్రుతి ధైవత శుద్ధనిషాదములు; షట్ఛ్రుతి ధైవత కైశికి నిషాదములు ఒక్క స్థానమునందే చెప్పబడుటచేత స్వరస్థానములు పండ్రెండుగ విదితములుగ నున్నవి. వీటిని ప్రస్తరించి శుద్ధ మధ్యమముతో 36 మేళములును, ప్రతి మధ్యమముతో 86 మేళములును మొత్తము 72 మేళములను ప్రస్తారక్రమముగ వివరించి, వాటియందు లక్షణ గీతములను గూర్చి, వేంకటమఖి మార్గదర్శకు డాయెను. ఈతని 72 మేళములు 'కనకాంబరి' మున్నగు పేర్లతో కలవు. ఇవి ఇప్పుడు వాడుకలో గల 'కనకాంగి', 'రత్నాంగి' మొదలగు పేర్లకంటె భిన్నములుగ నున్నవి. వేంకటమఖి తన కాలమునాటి మేళము లిట్లు పేర్కొనెను --(1) ముఖారి, (2) సామవరాళి, (3) భూపాలము, (4) హెజ్జజ్జి, (5) వసంతభైరవి, (6) గౌళ, (7) భైరవి, (8) ఆహిరి, (9) శ్రీ రాగము, (10) కాంభోజి, (11) శంకరాభరణము, (12) సామంత, (13) దేశాక్షి, (14) నాట, (15) శుద్ధవరాళి, (16) పంతువరాళి, (17) శుద్ధ రామక్రియ, (18) సింహారవ, (19) కల్యాణి. ఇతడు తక్కిన రాగములు వీటి జన్యము లనెను.

పురందర విఠలుడు: ఇతడు “సద్రాగ చంద్రోదయము", “రాగమాల" అను గ్రంథములు రచించెను. విద్యార్థులకు వలయు పిళ్ళారి గీతములు, రాగలక్షణము నిలుపు లక్షణ గీతములు, పెక్కు కీర్తనలు కన్నడ భాషలో ఇతడు చెప్పెను. సూళాది సప్తతాళములు విశ్రుతము లగుటకు స్వరాలంకారములను గూర్చెను. నేటికిని ఇవి ఆదరింప బడుచున్నవి.

క్షేత్రయ : తంజావూరు నేలిన విజయరాఘవుని కాలమున (క్రీ శ. 1639-73) నాయికారీతుల చొప్పున శృంగారభావము పుంఖానుపుంఖముగా వెలయ దేశీయ రక్తిరాగములందు వేనవేలు పదములు పాడినవాడు. పదవాఙ్మయమునకు మార్గదర్శకుడు. అంగోపాంగాభి నయము చూరగొను భావము, రాగవిన్యాసాదికమున విలంబకాలమున తాళము నడచుట వీటియందు కన నగును. ఈతని మధురభావో పేతములయిన పదములు అనతికాలముననే దేశమున విశ్రుతములై, నర్తకులకు అమృతతుల్యములై వరలెను. పెక్కుపదములు త్రిపుట, రూపకము, ఆది అను తాళములలో ఇతనిచే చెప్పబడెను.

నారాయణతీర్థులు సంస్కృతమున గానయోగ్యముగ "శ్రీకృష్ణ లీలాతరంగిణి" ని రచించెను.

మరికొందరు పదకర్తలు : క్షేత్రయ పదవాఙ్మయ రీతులను అనుసరించి 18. 19 శతాబ్దము లందలి గోవింద సామయ్య, కూవన సామయ్య, ఘనం సీనయ్య, వీర భద్రయ్య, ఆది అప్పయ్య (క్రీ.శ.1720). సారంగపాణి మున్నగు నాట్యాచార్యులును, గాయకులును పదములు,

340