Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గర్భధారణము - ప్రసవసమస్యలు

బయటకు వచ్చుటయో జరుగవచ్చును. చేయి ముందుగా వెలుపలకు వచ్చుటనుబట్టి శిశువు అడ్డముగా ఉన్నట్లు

చిత్రము - 94

పటము - 1

శిశువుయొక్క సహజమగు ఉనికి.

1. గర్భాశయపు గోడ 2. ద్రవముతో నిండిన తిత్తి. 3. పిండము. 4. బొడ్డుత్రాడు 5. మావి. 6. గర్భాశయపు మార్గము.

ప్రసవమందు ద్వితీయదశను సూచించు పటము. గర్భాశయ మార్గము విస్తరించి యున్నది. మరియు ద్రవముతో నిండిన తిత్తి ముందరకు చొచ్చుకొని యున్నది.

తెలియును. తల అసహజస్థితిలో ఉన్న యెడల తలను కొంచెముగా నొక్కుటవలన సహజమగు ప్రసవము కలుగ గలదు. ప్రసవమునకు ముందుగా లోపమును నిర్ధారణ చేసినయెడల శిశువు సరియగు స్థితిలో బయటికి వచ్చు నట్లు సవరింపవచ్చును. పిండము అడ్డముగా నున్న యెడల సహజమగు ప్రసవము కలుగదు. ఈ చికిత్సయందు రెండు ప్రధాన సూత్రములు కలవు. గర్భస్థపిండము సజీవముగా నున్నదా యనునది మొదటి విషయము ; గర్భాశయ ముఖద్వారము (cervix) పూర్తిగా పెద్దదైనదా యనునది రెండవ విషయము.

గర్భాశయములోనిపిండము సజీవముగా నున్న యెడల మత్తుమందు నిచ్చి, గర్భాశయము లోనికి చేతినిపోనిచ్చి, శిశువును వ్రేళ్ళతో పట్టుకొని బయటికిలాగ వచ్చును. లేదా కడుపుమీద ఆపరేషన్ చేసి కడుపు నుండి బిడ్డను తీయవచ్చును. దీనినే 'సిజేరియన్ ఆపరేషన్‌' అందురు. చరిత్ర ప్రసిద్ధుడైన జూలియస్‌సీజరు శిశువుగా గర్భమునం దున్నప్పుడు అట్లుతీయబడుటవలన ఇట్టి ఆపరేషనుకు ఆ పేరు కలిగెను. గర్భములో శిశువు చనిపోయిన ఎడల దాని తలను చిదుకకొట్టి ముక్కలను వెలుపలికి తీసివేయవచ్చును. ఒక్కొక్కప్పుడు శిశువు తల మిగులపెద్దదిగా ఉండుటచేత సహజముగా ప్రసవము జరుగకపోవచ్చును. అప్పుడా పిండమును చిదుగగొట్టి బయటికి తీయవలసి యుండును.

చిత్రము - 95

పటము - 2

శిశువు అసహజస్థితిలో బయటికివచ్చుట.

1. తొంట్లు ముందుగా బయటికి వచ్చుట

2. ముఖము ముందుగా వచ్చుట

3. చెయ్యి ముందుగా వచ్చుట

కూపకము ( పెల్విస్) సంకోచమునొందుట : కటిప్రదేశమందలి ఎముకలు తరచుగా సంకోచమొందుచున్న యెడల అనుసరింపవలసినమార్గము ఒక్కటే. పిండమును పూర్తిగా పెరుగనిచ్చి, ఎదిగిన తర్వాత సిజేరియన్ ఆపరేషన్ చేయవలెను. అటూఇటూ కానిపరిస్థితిలో నున్న స్త్రీ విషయములో, ఆమె నొప్పులుపడువరకు ఊరకుండి

317