Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్యవాఙ్మయము (సంస్కృతము)

భూతం కంద మూలఫలం అవహీనాః కథాః, గలితాః కల్యాణోత్సవక్రియాః, బహులీ భూతాని తస్కర కులాని, అన్యోన్యమభక్షయ న్ప్రజాః, పర్యలుఠన్నితస్తతో బలాకా పాండురాణి నరశిరః కపాలాని, పర్యహిండంత శుష్కా: కాకమండల్యః, శూన్యభూతాని నగర గ్రామ ఖర్వటపుట భేదనాదీని"

(దశ కు.)

బాణుడు సర్వకవి మూర్థాభిషిక్తుడు; మహా మేధావి, గద్య రచనా విశారదుడు. ఇతని ప్రతిభా వ్యుత్పత్తులు అనితరతుల్యములు. ఇతడు శ్రీ హర్ష చక్రవర్తికాలమున నున్న వాడు. ఇతని హర్షచరితము తొమ్మిది ఉచ్ఛ్వాసములు కల గద్యకావ్యము. కాన్య కుజ్జేశ్వరుడగు హర్షవర్ధనుని చరిత మిందు కీర్తింపబడినది. కవి తొలిమూడు ఉచ్ఛ్వాసములలో స్వీయ వృత్తాంతమును సంగ్రహముగ చెప్పికొనియున్నాడు. దానిని బట్టి ఇతడు కవిసార్వ భౌముడని, వాత్స్యాయన వంశ సంభవుడని తెలియుచున్నది. శేషించిన ఉచ్ఛ్వాసములలో రాజవర్ధన హర్షవర్ధనుల శౌర్యాది గుణములు, మాళ వాధిపతినాశము మొదలగు నంశములు వర్ణితములైనవి. ఈ కవీంద్రుని చారు రచనా చాతురి, లోకోత్తర పదవిన్యాసోల్లాసము, సురుచిర క థా చిత్రణము, కావ్య రసికులకు చేతో మో దావహములు. ఉదా :

"యస్మింశ్చ రాజని నిరంతరై ర్యూపనికరై రంకురిత మివ కృతయుగేన, దిఙ్ముఖ విసర్పిఖి రధ్వరధూమైః పలాయిత మివ కలినా, ససుధైః సురాలయైరి వావతీర్ణ మివ స్వర్గేణ, సురాలయ శిఖరోద్ధూయమానైర్ధవల ధ్వజైః పల్లవిత మివ ధర్మేణ, బహిరుపచరిత వికట సభాసత్రప్రపా ప్రాగ్వంశ మండపైః ప్రసూత మివ గ్రామైః, కాంచన మయ సర్వోపకరణై ర్విభవై ర్విశీర్ణ మివ మేరుణా, ద్విజ దీయమానై రర్థకుశలైః ఫలిత మివ భాగ్య సంపదా. "

(హ. చ.)

కాదంబరి బాణుని ద్వితీయ గద్యరత్న సృష్టి. 'బాణోచ్ఛిష్టం జగత్సర్వం', 'కాదంబరీ రసజ్ఞానా మాహారో౽పి నరోచతే'- ఇత్యాది సూక్తులకు నిదాన భూతమయిన దీ మహా కావ్యము. ఇందలి కథ గుణాఢ్య విరచిత బృహత్కథా గృహీతము. ఇది కవి ప్రతిభా వ్యుత్పత్తులచే సుపరిష్కృతమును, రసగుణాలంకారాది విశిష్టమును, సర్వోత్కృష్టమునై అలరారుచున్నది. ఇందలి ప్రధానేతి వృత్తము కాదంబరీ చంద్రాపీడులకు సంబంధించినది. ఇందు అవాంతర కథలు పెక్కులు కలవు. శృంగార మంగిరసము. తక్కు రసము లంగములుగా ప్రవేశము నొందినవి. శుకనాసోపదేశము, అచ్ఛోద సరో వర్ణనము, తదితర ప్రకృతివర్ణనములు కవియొక్క వర్ణన సామర్థ్యమునకు నిదర్శనములు.

ప్రశస్తశుకనాసోపదేశో దాహరణము :

"యౌవనారంభే చ ప్రాయః శాస్త్రజల ప్రక్షాళన నిర్మలాపి కాలుష్య ముపయాతి బుద్ధిః. అనుజ్ఝితధవళతాపి సరాగైవ భవతి యూనాం దృష్టిః. అపహరతి వాత్యేవ శుష్కపత్రం, సముద్భూతరజోభ్రాంతి రతిదూరమాత్మేచ్ఛ యా యౌవనసమయే పురుషం ప్రకృతిః. ఇంద్రియ హరిణ హారిణీ చ సతత దురంతేయ ముపభోగ మృగతృష్ణి కా'

అచ్ఛోద సరో వర్ణన మత్యంత హృద్యము. ఉదా :

"యౌవన మివోత్కలికా బహులం, షణ్ముఖ చరిత మివ శ్రూయమాణ క్రౌంచ వనితావిలాపం, భారత మివ పాండవ ధార్తరాష్ట్ర కులకృతక్షోభం, కద్రూస్తన యుగల మివ నాగ సహస్రపీతపయో గండూష మచ్ఛోదం నామ సరోదృష్టవాన్ ."

పాంచాలరీతి నాశ్రయించి రచన యొనర్చినవా డీ కవి వర్యుడు. వర్ణ్యవస్తువునకు అనురూపమైన పదములను కూర్చుటయం దితడు ప్రదర్శించిన కౌశల మనన్య సామాన్యము. వికటవింధ్యాటవిని వర్ణించు సందర్భమున ఇతడు వికటశబ్దాటోపములను ప్రయోగించెను. ఉదా :

"క్వచిత్ప్రళయ వేళేవ మహావరాహ దంష్ట్రా సముత్ఖాత ధరణిమండలా, .................. క్వచిదుద్దత మృగపతినాదభీతేవ కంటకితా."

వసంతమును వర్ణించుపట్టున ఇతడుపయోగించిన మృదులపదజాల మెన్నదగినది. ఉదా:

"అశోకతరుతాడనరణిత రమణీమణినూపుర ఝంకార సహస్రముఖరేషు, సకలజీవలోక హృదయానంద దాయకేషు, మధుమాసదివనేషు.”

ధర్మరాజ, త్రిలోచన, గోవర్ధనాచార్య, త్రివిక్రమభట్ట ప్రభృతుల ప్రశంసల నందుకొనిన కవిచతురానను డీ బాణుడు. ఇట్టి మహామహుడు కాదంబరిని పూర్తి చేయ

299