Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యవాఙ్మయము (సంస్కృతము)

సంగ్రహ ఆంధ్ర

వైయాకరణః శక్నోతి యథాయథం విపరిణమయితుం। తస్మాద ధ్యేయం వ్యాకరణం।"

“ఆగమః ఖల్వితి” - బ్రాహ్మణేన నిష్కారణో ధర్మః షడంగో వేదో౽ధ్యేయో జ్ఞేయశ్చేతి। ప్రధానం చ షడంగేషువ్యాకరణం. ప్రధానేకృతో యత్నః ఫలవాన్భవతి."

సంక్షిప్త సూత్రార్థ వివరణాత్మక ములయిన దార్శనిక భాష్యములందలి గద్యగుంఫము అతి ప్రౌఢము. కొన్ని ఉదాహరణములు :

వైశేషికదర్శన ప్రమాణభూత భాష్యకారులగు ప్రశస్తపాదాచార్యుల గద్యగుంఫశైలి ప్రగల్భమై, అద్భుతావహముగ నున్నది.

“ఇహేదానీం చతుర్ణాం మహాభూతానాం సృష్టిసంహార విధిరుచ్యతే. బ్రాహ్మాణేన మానేన వర్షశతాంతేన వర్తమానస్య బ్రహ్మణో౽పవర్గ కాలే సంసార ఖిన్నానాం సర్వప్రాణినాం నిశి విశ్రామార్థం సకలభువనపతేర్మహేశ్వరస్య సంజిహీర్షాసమకాలం శరీరేంద్రియమహాభూతోప నిబంధకానాం సర్వాత్మగతానాం అదృష్టానాం వృత్తి నిరోధే సతి మహేశ్వరేచ్ఛాత్మాణుసంయోగజ కర్మభ్యః శరీరేంద్రియకారణాణువిభాగేభ్యః తత్సంయోగనివృత్తౌ, తేషామాపరమాణ్వంతో వినాశః ; తథా పృథివ్యుదక జ్వలనపవనానామపి మహా భూతానాం అనేనైవ క్రమేణ ఉత్తరస్మిన్సతి పూర్వస్య నాశః, తతః ప్రవిభక్తాః పరమాణవో౽వతిష్ఠం తే."

న్యాయమంజరీ ప్రణేతయు న్యాయదర్శనాచార్యుడు నగు జయంతభట్టు నిర్మించిన గద్యసరణి ప్రౌఢమును, సాలంకారమును, సహృదయ చేతో మోదావహమునై వరలుచున్నది. ఉదా :

“తేన ప్రామాణ్యాధిగమోపాయ విశేషాత్ సమాన యోగక్షేమతయా చత్వారో౽పి వేదాః ప్రమాణం వ్యవ । హారో౽పి సర్వేషాం సారతరవిచార చతురచేతసాం చతుర్భిరపి వేదైశ్చతుర్ణాం వర్ణాశ్రమాణాం చతసృషు దిక్షు చతురబ్ధి మేఖలాయామవనౌ ప్రసిద్ధ ఇతికో౽యమత్రాన్య థాత్వభ్రమః? శ్రుతిస్మృతి మూలశ్చార్యావర్తినాం భవతి వ్యవహారః| తేచశ్రుతి స్మృతీ చతురో౽పి వేదాన్ సమాన కక్షానభివదతః ఋగ్యజుస్సామవేదేష్వపి అథర్వవేదా శంసీని భూయాంసి వచాంసి సంతి."

ప్రౌఢమీమాంసకుడును పూజ్యుడునగు శబరస్వామి గద్యశైలి మధురోదాత్తమైనది. ఉదా :

"ఇచ్ఛయా౽త్మానముపాలభామహే కథమితి । ఉపలబ్ధవూర్వేహ్యభిప్రేతే భవతీచ్ఛా । యథా మేరుముత్తరేణ యాన్యస్మజ్జాతీయైరనుపలబ్ధపూర్వాణి స్వాదూని వృక్షక ఫలాని తానిప్రత్యస్మాకమిచ్ఛా భవతి. "

(1-1-5.)

శ్రీమచ్ఛంకర - శ్రీమద్రామానుజ శ్రీమధ్వాచార్య భగవత్పాదుల ప్రౌఢోదాత్త గద్య రచనా శైలి గంగా ప్రవాహము భంగి గంభీరమై పాఠకులను అత్యంత విస్మయావిష్టమనస్కుల నొనర్చును. ఉదా :

"యుష్మదస్మత్ప్రత్యయగోచర యోర్విషయవిషయిణోసమఃప్రకాశవద్విరుద్ధస్వభావయో రిత రేతర భావా నుప పత్తౌ సిద్ధాయాం, తద్ధర్మాణామపి సుతరామితరేతర భావానుపపత్తిరి త్యతో౽స్మత్ప్రత్యయగోచరే విషయిణి చిదాత్మకే యుష్మత్ప్రత్యయ గోచరస్య విషయన్య తద్ధర్మాణాం చాధ్యాస స్తద్విపర్యయేణ విషయిణ స్తద్ధర్మాణాం విషయే౽ధ్యాసో మిథ్యేతి భవితుం యుక్తం తథాప్యన్యోన్య స్మిన్నన్యోన్యాత్మక తామన్యోన్య ధర్మాం శ్చాధ్య స్యేతరేతరా వివేకేనాత్యన్త వివిక్తయో ర్ధర్మ ధర్మిణోర్మిథ్యాజ్ఞాననిమిత్తస్సత్యానృతేమిథునీకృత్యాహ మిదం మమేదమితి నైసర్గికో౽యం లోకవ్యవహారః। ఆహ కోయమధ్యాసోనామేతి ఉచ్యతే ? స్మృతిరూపః పరత్ర పూర్వదృష్టావభానః. తం కేచి దన్యత్రాన్యధర్మో ధ్యాస ఇతివదంతి: కేచిత్తు యత్ర యదధ్యాసస్ద్వివే కాగ్రహ నిబంధనోభ్రమ ఇతి। అన్యేతు యత్రయదధ్యాస స్తస్యైవ విపరీత ధర్మత్వకల్పనామాచక్షత ఇతి। సర్వథాపి త్వన్యస్యాన్యధర్మావభాసతాం న వ్యభిచరతి | తథాచ లో కే౽నుభవః ‘శుక్తి కాహి రజతవదవభాసతేఏకశ్చంద్ర స్సద్వితీయవదితి (శాంకర బ్రహ్మసూత్ర భాష్యము - జిజ్ఞాసాధిక రణము.)

క్రీ. శ. 14 వ శతాబ్దియందు సాయణాచార్యులవారు వేదార్థప్రకాశమను పేర రచించిన ఋగాది సంహితా బ్రాహ్మణారణ్యకాదుల భాష్యములు కల్పతరువులై, కూలంకషముగ సకలార్థబోధకములై యొప్పారుచున్నవి. ఈ మహాపండితుని వేదభాష్యములకు భట్టభాస్కర మిశ్రాదుల భాష్యములు మార్గదర్శకములైనట్లు విదితమగు

296