Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్యవాఙ్మయము (సంస్కృతము)


తదల్పం । యోవైభూమా తదమృత మథ
యదల్పం తన్మర్త్యం.

(ఛాందోగ్య, 7-24)

సూత్రసాహిత్యమున గల గద్యము అత్యంత సంక్షిప్తమును, అత్యంత గభీరమును, విపుల వ్యాఖ్యానము నపేక్షించునదియునై యున్నది. ఉదా :


ఇకోయణచి । అనచిచ । వృద్ధిరేచి । హశిచ ।
రోరి । ఓసిచ । జసః శీ వోతోగుణవచనాత్ ।
క్తస్యచవర్తమానే !

(సిద్ధాంత కౌముది)


అథాతోబ్రహ్మజిజ్ఞాసా । జన్మాద్యస్యయతః
శాస్త్రయోనిత్వాత్ । తత్తుసమన్వయాత్ ।
శ్రుతత్వాచ్చ !
(శాంకర బ్రహ్మసూత్ర భాష్యము, జిజ్ఞాసాధికరణము).

సంస్కృత భారతాదిని పౌష్యపర్వములో-

సౌతిరువాచ - గద్యమ్ :


“జనమేజయః పారిక్షితః సహ భ్రాతృభిః కురుక్షేత్రే
దీర్ఘసత్రముపాస్తే"

ఇత్యాదిగా మూడుపుటల గ్రంథమును, సంభవపర్వమున:


"శంతనుః ఖలు గంగాం భాగీరథీముపయేమే.
తస్యామస్య జజ్ఞే దేవవ్రతోనామ యమాహు
ర్భీష్మమితి."

ఇత్యాదిగా రెండుపుటల కథయు కనబడుచున్నవి. ఇందలి వాక్యములు చిన్నవై, సరళములై, కారకమర్యాదో పేతములై శోభిల్లుచున్నవి.

భరతాచార్యుడు మున్నగువారి నాట్యశాస్త్రాదుల యందలి గద్యభాగము లింతకంటె ఒకించుక ప్రౌఢములుగ నున్నవి. పురాణసాహిత్యమునందలి సంస్కృతగద్యము సుమనోహరమైనది. ఉదా :

"యథైవ వ్యోమ్ని వహ్నిపిండోపమం త్వామహమ పశ్యం, తథైవా౽ద్యాగ్రతో గతమప్యత్ర భగవతా కించిన్న ప్రసాదీకృతం విశేష ముపలక్షయామీత్యు క్తేన భగవతా సూర్యేణ నిజకంఠాదున్ముచ్య స్యమంతకం నామ మణివర మవతార్య ఏకాంతే న్యస్తం.”

(విష్ణుపురాణము 4-13-14)

నిరుక్తమునందు గద్యరూప సూత్రములు కలవు. అందలి యాస్కాచార్యుని నిర్వచన శైలి విలక్షణము, హృదయంగమము. ఉదా :


నరకం – న్యరకం నీచైర్గమనం నాస్మిన్ రమణం స్థాన మల్ప మప్యస్తివా !
నాకం - కమితి సుఖనామ తత్ప్రతిషిద్ధం
సూర్యం - సత్తేర్వా స్వీర్యతేర్వా ఇతి ।
భద్రం – భజనీయం, భూతానామభి ద్రవణీయం భవద్రమయతీతి ।

యాస్కుని వ్యాఖ్యాన ప్రకారము సర్వోత్కృష్టము. ఆతని గద్యశైలి సరసము, సులభము. ఉదా :


హిరణ్య గర్భః సమవర్తతాగ్రే
భూతస్య జాతః పతిరేక ఏవ

(ఋగ్వేదము.)

"హిరణ్యగర్భః హిరణ్మయో గర్భో౽స్యేతి. హిరణ్యం కస్మాత్ ? హ్రియతే ఆయమ్యమానం వా, హ్రియతే జనాజ్జనమితివా, హితరమణం భవతీతివా, హర్యతేర్వాస్యాత్ప్రేప్సా కర్మణః । అగ్రే సమభవత్ । భూతస్యజాత ఏక ఏవ పతిః । సదాధార పృథివీం దివంచ । సూర్య ఏవ ఆకర్షణద్వారాపృథివీం ధారయతి దివంచేతి భావః.”


“మహాభాష్యం వా పఠనీయం,
 మహారాజ్యం వా శాసనీయం”

అను సూక్తికి నిదాన భూతమైన భగవత్పతంజలి మహా భాష్యము నందలి గద్యసరణి సుస్పష్టము, ఉదాత్తము, మనోహరము, ఆదిపాఠకులకు షడ్రసోపేత భోజనము.

ఉదా :

"అథ గౌరిత్యత్ర కశ్శబ్దః ? కిం యత్తత్సాస్నా లాంగూల కకుద ఖురవిషాణ్యర్థ రూపం సశబ్దః ? నేత్యాహ | ద్రవ్యం నామతత్। యత్తర్హి తదింగితం చేష్టితం నిమిషిత మితి సశబ్దః ? నేత్యాహ। క్రియానామసా। యత్తర్హి తచ్ఛుక్లో నీలః కపిలః కపోత ఇతి । స శబ్దః ? నేత్యాహ | గుణోనామ సః । యత్తర్హి తద్భిన్నే ష్వభిన్నం ఛిన్నేష్వ చ్ఛిన్నం. సామాన్యభూతం సశబ్దః? నేత్యాహ॥ ఆకృతి ర్నామసా । కస్తర్హి శబ్దః ? యేనోచ్చారితేన సాస్నా లాంగూల కకుద ఖురవిషాణినాం సంప్రత్యయో భవతి సశబ్దః ।"

........ ........ ........... ........... ...........

“ఊహః ఖల్వితి" - న సర్వైర్లింగైర్నచ సర్వాభిర్వి భక్తి భిః వేదే మంత్రా నిగదితాః । తేచావశ్యం యజ్ఞగతేన పురుషేణ యథాయథం విపరిణమయితవ్యాః । తాన్నా

295