Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గతితార్కిక భౌతికవాదము

సంగ్రహ ఆంధ్ర

కొనుటయే 'గతితార్కికము' అను పదమున కర్ణము . హెగెల్ అభిప్రాయమును బట్టి, మానవజీవితానుభవముల యొక్కయు, చారిత్రకానుభవముల యొక్కయు సంఘర్షణమే గతితార్కికవాదమున కర్థము. భావములు, అనుభవములు, సంఘటనలు సంఘర్షించి ఒకదానిపై మరొకటి ఆధిపత్యము వహించు క్రమవిధానములో నొక సంయోగీకరణము (Synthesis) ఉద్భవించును. సంఘర్షించు ఇరుపక్షములందలి కొన్ని సత్యములు సంయోగీకరణమందు ప్రవేశము కల్పించుకొనును. ఇట్లు సాధింపబడిన సంయోగీకరణము మరల నొక నూతన సంయోగీకరణ మగును. ఇట్లీ విధానము నిర్విరామముగను, చర్వితచర్వణముగను కొనసాగుచు, ఒక సంయోగీకరణము కంటె, దాని తరువాతి సంయోగీకరణము నిర్మలమైనదిగను, ఉన్నతమైనదిగను రూపొందును. తార్కిక చర్చలను ప్రతిబింబింపజేయు ఈ విధానమునకు మార్క్స్ 'గతితార్కిక ' మని పేరిడెను. ఈ విధాన క్రమమును క్రమపద్ధతిలో కొనసాగించినచో, తుట్టతుదకు, సచ్చిదానందమయ మగు సత్యమును గ్రహింపనగును. కాని మార్క్స్, ఎంగెల్సులు ఈ భావమును నిరాకరించిరి. మానవ మేధస్సును ప్రతిబింబించుచు, విభిన్నములయిన భావనారీతులలో పరివర్తన నొందు ఆదర్శవంతమైన విశ్వము తప్ప, మార్క్, ఎంగెల్స్ ఇద్దరును మరొక విషయము భావన చేయలేదు.

మార్క్స్, గతితార్కిక భౌతికవాద సూత్రమును చారిత్రక, సామాజికగతులయొక్క వివరణపరముగా అన్వయించెను. దీని ఫలితముగా, మార్క్సిస్టు తత్త్వశాస్త్రమనునది పరిణామ మొందెను. ఎంగెల్స్ ఈ తత్త్వశాస్త్రమును గూర్చి ఇట్లు వ్యాఖ్యానించెను. “మానవ జీవితాధారములైన పదార్థముల ఉత్పత్తి, ఉత్పత్తియయిన పరార్థముల వినిమయము (exchange) మాత్రమే సామాజిక నిర్మాణమునకు పునాది యగును. ఈ ప్రతిపాదనము నుండియే చరిత్రయొక్క భౌతికవాదభావన ప్రారంభమగును. మానవచరిత్రలో గత సామాజికవ్యవస్థలయందు ధనము పంపకము జరిగిన విధానము, సమాజము వర్గములుగా విభజింపబడిన తీరు - ఈ రెండును ఉత్పత్తియైన పదార్థములపైనను, ఉత్పత్తివిధానము మీదను, సరకులు వినిమయ మయ్యెడి క్రమముపైనను ఆధారపడి యుండెను. ఈ దృక్పథము ననుసరించి, సాంఘిక పరివర్తనములకును, రాజకీయ విప్లవములకును గల కారణములు మానవుల మనస్సులయందును, బాహిరములైన సత్యములందును, న్యాయములందును గాక, ఉత్పత్తి, వినిమయ విధానములందు మాత్రమే కాననగును. అనగా, ఆ కారణములు తత్త్వశాస్త్రమందుగాక, ఆయా ప్రత్యేక సామాజిక వ్యవస్థలయొక్క ఆర్థికవిధానములందు మాత్రమే గోచరించును. ఈనాటి సాంఘికసంస్థలు అక్రమమైనవనియు, అన్యాయమైనవనియు, న్యాయము అన్యాయముగను, ధర్మము అధర్మముగను పరిణమించిన స్థితి కలవనియును స్పష్టమగుచున్నది. ఉత్పత్తి, వినిమయ విధానములలో పరివర్తనములు శాంతముగను, సౌమ్యముగను జరుగుటవలననే పైని పేర్కొన్న సత్యము ధ్రువపడుచున్నది. ప్రాచీనపరిస్థితులతో ముడివడిన సాంఘికవ్యవస్థ ఆథునిక పరిస్థితులకు సరిపడదు. ఆకాలపు వ్యవస్థలయందు పొడసూపిన అసంబద్ధములే అనంతర కాలములో మారిన ఉత్పత్తివిధానములందును మరొక రూపములో ప్రత్యక్షమైనవని పై అంశములవలన తేటపడుచున్నది."

కారల్‌మార్క్స్, ఎంగెల్స్‌లచే ప్రతిపాదింపబడిన సిద్ధాంతముయొక్క వివరణమునుబట్టి ముఖ్యమైన రెండు విషయములు ఉత్పన్న మగుచున్నవి. (1) సంఘర్షణములచే సమాజములో పరివర్తనము లేర్పడును. ఈ సంఘర్షణములు ఏ మానవుని మనస్సునుండి బయలుదేరునవి కావు. అవి మానవుని వాంఛలయందుగాని, లేక భావముల యందుగాని పొడచూపవు. కాగా, ఆ సంఘర్షణములు ఉత్పత్తిక్రమములందే ఉద్భవించును. ఈ ఉత్పత్తి విధానములందే సామాజిక పరివర్తన క్రమము గూడ గోచరమగును. (2) సాంస్కృతిక జీవితమునకు రూపము కల్పించు వివిధ విషయములు నైతిక, మత, న్యాయ, కళాత్మక సంస్థలన్నియు ప్రాథమిక ఆర్థిక నిర్మాణము యొక్క ఉపఫలములు (Bye-Products).

ఈ సిద్ధాంతమునే ఇంకను విపులీకరించినచో ఈ క్రింది అంశములు విదితములగును.

మానవులకు, పదార్థములకు ఎల్లపుడును పరస్పర సంబంధము కలదు ఈ సంబంధము కారణముగా మాన

278