విజ్ఞానకోశము - 3
గణితశాస్త్ర చరిత్రము
నుండియు విద్యార్థులను ఆకర్షించెను. అచ్చటి వారు కొందరు, గ్రీకులచేతను, అరబ్బులచేతను అసాధ్యమని వదలివేయబడిన ఘనసమీకరణములను సాధించుటచే, అది విజ్ఞానక్షేత్రమున గొప్ప సంచలనమును కలుగజేసి, పరిశోధనాసక్తిని మరల వృద్ధిపొందించెను. (ఈ కాలముననే అచ్చుయంత్రము క నుగొనబడెను. అమెరికాఖండము గూడ ఇదేకాలమున కనుగొనబడెను) ఘనసమీకరణముల సాధనను మొదట కనుగొనినవాడు ప్రొఫెసర్ సిపియో డెల్ ఫెర్రో (Scipio Del Ferro - క్రీ. శ. 1528). కాని ఇతడు తనపరిశోధనలు ప్రచురింపకయే కొందరు స్నేహితులతో మాత్రము చెప్పి చనిపోయెను ఈ పద్ధతినే' తార్‌తాగ్లియా' (Tartaglia) అను నొక లెక్కగాడు మరల క్రీ. శ. 1535 లో కనుగొనెను. కాని దానిరహస్యమును ఇతరులకు వెల్లడించ నిష్టపడకపోయెను. కాని ఈతని స్నేహితుడును, మిలాన్ నగర వైద్యుడును అగు 'కార్టన్' అను నాతడు, ఇతరుల కెవ్వరికిని చెప్పనని ప్రమాణముచేసి, ఈ రహస్యమును ఆతనినుండి గ్రహించెను. వెంటనే 1545 లో తాను రచించిన 'ఆర్స్ మాగ్నా' (Ars Magna) అను గ్రంథములో దానిని ప్రచురించెను. అందుపై స్నేహితు లిరువురికిని వివాదము పెరిగి ఒకరి నొకరు దూయబట్టుకొనిరి. దీనిలో ఈయబడిన పద్ధతిని 'కార్టాన్' పద్ధతి యందురు. x3 + pn = q అను సమీకరణము యొక్క మూలము
ఈ గ్రంథముననే మరియొక గొప్ప విషయము కూడ ఈయబడినది. అది ఏమనగా చతుర్థవర్గ సమీకరణ సాధనము. దీనిని కనుగొనినవాడు 'ఫెర్రా' (Ferra) అను నొక విద్యార్థి. ఈ పద్ధతి ఘనసమీకరణ సాధనపై ఆధారపడియుండును.
పై చెప్పిన సమీకరణముల సాధనము సుసాధ్యమగుట కొక కారణము ఆనాటికి ప్రచారములోనికి వచ్చిన "క్లిష్ట సంఖ్యలు" (complex numbers), notes
17 వ శతాబ్ది ఆరంభమునాటికి 'కాంప్యుటేషనల్ టెక్నిక్ ' (computational technique) చాలా వృద్ధి బొందెను. 'జాన్ నేపియర్' (John Napier) అను స్కాట్లండుదేశీయుడు 1614లో 'లోగరిథమ్స్ 'ను (Logarithms) కనుగొని, పెద్దగుణకారములను కూడికలుగా మార్చివేయు పద్ధతిని ప్రవేశపెట్టెను. దానిని కెప్లర్ మున్నగువారు ప్రచారములోనికి తెచ్చిరి.
ఆధునికయుగము: 17 వ శతాబ్ది ఆరంభమునకే యంత్రయుగము ఆరంభమైనదని చెప్పవచ్చును. క్రొత్తక్రొత్త యంత్రములను కనుగొనుట, వాటి కనుగుణమగు యంత్రశాస్త్ర మభ్యసించుట మున్నగునవి అనివార్యమాయెను. 1620 నాటికి 'స్టివెనస్' అను శాస్త్రజ్ఞుడు స్థితిశాస్త్రమునకును, ద్రవస్థితి శాస్త్రమునకును అత్యంతమైన సేవ యొనర్చెను. ఈ కాలముననే 'పీసా' విశ్వవిద్యాలయములో నుండిన గెలిలియో (1564-1642) చలన శాస్త్రమును, గణితశాస్త్ర పద్ధతిని వృద్ధిపరచెను. ఖగోళశాస్త్రమున కాతడు మిగులసేవ యొనరించెను. మొట్టమొదటగా టెలిస్కోపు కనుగొనిన దాతడే. దాని మూలమున గ్రహములను వీక్షించి అవి యన్నియు సూర్యునిచుట్టును తిరుగుచుండుట ఆతడు చూచెను.
అప్పటివరకు జరిగిన యాంత్రిక శాస్త్రాభివృద్ధిని గమనించిన కలన గణితమును ఒక సక్రమపద్ధతిని వృద్ధిపరచుటకు అవసరమగు సమయము ఆసన్నమైనట్లు తోచెను. కలనగణితము లేకుండ, ఇకముందు పరిశోధనములు సాగునట్లు కనిపించలేదు. అందుచే కొందరు గణిత శాస్త్రజ్ఞుల దృష్టి కలనగణిత సృష్టివైపు మరలెను. వారిలో మొట్టమొదటి వాడు గెలిలియో శిష్యుడగు 'కావలీరీ ' (Cavalieri). ఇతడు 1635 లో "జామెట్రిస్ ఇన్డివిజిబిలిబిస్ కన్టిన్యు వోరమ్" (Geometrice Indivisibilibes Continuorum) అను గ్రంథమును రచించి కలన గణితమునకు ఒక స్వరూపమును కల్పించెను. అతి మందకొడిగా నడచిన కలనగణిత వికాసము 'డెకార్టే' (Descartes) అను ఫ్రెంచి తత్త్వవేత్త రచించిన 'జామెట్రిక్ ' (Geometric 1637) అను గ్రంథప్రచురణముచే చురుకెక్కెను. అప్పటినుండి ఆధునిక గణితశాస్త్రము ప్రారంభమైనట్లు ఎంచవచ్చును. ఇప్పటి మన 'కో ఆర్డినేట్ జామెట్రీ' (Coordinate Geometry) అప్పటితో ప్రారంభమైనట్లు భావింపవచ్చును. దీని విశిష్టత ఏమనగా, అంతకుముందు క్షేత్రగణితము, బీజగణితము ఒకదాని
265