Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గడియారములు

గర్భ భాగమందు, అడుగున రంధ్రముగల 360 పాత్రలుండెడివి. ప్రతిదినము ఒక పూజారి ఈ పాత్రలను పాలతో నింపెడివాడు. ఈ పాత్రలు 24 గంటలలో ఖాళీ యగున ట్లేర్పాటు చేయబడెను. ఈ విధముగా సంవత్సరాంతము వరకు వంతుల ప్రకారము ఈ పాత్రలు నింపబడుచు, ఈ ప్రక్రియవలన కాలమానము గణింప బడుచుండెడిదని తెలియుచున్నది.

ఇదిగాక 'ఇసుక గడియారమ' నెడి మరొకసాధనము స్వల్పమైన కాలపరిమితినిమాత్రమే నిర్ణయించుటకు ఉపకరించునదిగా నుండెను. ఇట్టి గడియారమును నిర్మించుటకు సశాస్త్రీయముగా తయారుచేయబడిన ఒకరకపు ప్రత్యేకమైన ఇసుకను సేకరించెడి వారు.

చిత్రము - 80

పటము - 4

గరాటా నీటిగడియారము

స్వయంచోదిములైన (automatic) గడియారములు : 'స్వయంచోదితమైన గడియారము ' అనునది మరియొక విధము. గడియారముతో మానవుని అవసరము అంత కంతకు అధికమగుటచే, దానిని సులభముగను, చౌకగను, నిపుణముగను, అధికసంఖ్యలో తయారు చేయుటకు పరిశోధనలు ప్రారంభమయ్యెను. 2000 సంవత్సరముల క్రిందనే ప్రథమముగా ఈజిప్టునందలి అలెగ్జాండ్రియా నగరములో స్వయంచోదిత గడియారములు తయారైనవి. ఈ గడియారముల పరిశ్రమ ప్రపంచములో ప్రప్రథమమున ఇచ్చటనే వెలసినట్లు చారిత్రకులు పేర్కొనినారు. మొదట ఈ పరిశ్రమ కొలదిమంది గుత్తవ్యాపారుల (monopolists) ఆధీనమందుండెడిది. కాని క్రమముగ అది సామాన్యులయిన పారిశ్రామికుల అధీనమయ్యెను. ఈ పారిశ్రామికులు "ఆటోమాటరిస్ క్లెపిడ్రన్” (ఆటోమాటిక్ నీటి గడియారములను తయారు చేసెడివారు) అని పిలువబడిరి.

పైన ఉదాహరింపబడిన గడియారములేకాక క్రీ. శ. 760 సం. ప్రాంతములో ఈజిప్టు, ఇటలీ, గ్రీసుదేశములలో విజ్ఞానశాస్త్రపరిశోధకులు 'వేయిన్నొక్క రాత్రుల గడియారములు', 'అలారంకొట్టు నిప్పుగడియారములు' అను విచిత్రనామములతో నొప్పు మరికొన్ని గడియారములను తయారు చేసినట్లును, విలాసవంతులగు మహారాజులు, మహారాణులు, ఐశ్వర్యవంతులు వీటిని అధికమూల్యమును చెల్లించి కొని వీటితో తమభవనములను అలంకరించుకొని నట్లును పెక్కు గాథలు కలవు. ఆనాడు లాంతరులోను, దీపపుప్రమిద మొదలైన వాటిలోను కాలెడి తైలమును బట్టియు, మైనపు వత్తులను బట్టియుగూడ కాలమానము నిర్ణయింపబడెడిది.

చైనాలో అలారము కొట్టెడి నిప్పుగడియారము పూర్వము విరివిగా వాడుకయందుండెను రంపపుపొడితో చేయబడిన ఒక పుడక ఒక చిన్న తొట్టెలో ఉంచబడెడిది. ఆ పుడకమీద అడ్డముగ ఒక దారమునకు రెండు చివరల యందు రెండు చిన్న రాగిగంటలు కట్టబడియుండును. పుడకయొక్క ఒక చివర నిప్పునకు అంటింపబడినచో అది మండుచుపోయి దారమును కాల్చెడిది. దారము తెగిపోగా, రెండుగంటలును శబ్దము చేయుచు తొ ట్టెక్రింద ఉంచబడిన పళ్ళెములో పడేవి. ప్రజ లీ గంటల శబ్దమును విని కాలమును తెలిసికొనెడివారు. అప్పటివరకు కాలమును విభజించుటలో శాస్త్రవేత్తలు వేర్వేరు విధానముల నవలంబించెడివారు. లోలకము (పెండ్యులమ్) తో నున్న గడియారములు కనిపెట్టబడిన తరువాతనే కాలమును గంటలు, నిమిషములు, క్షణములలోనికి విభజించుట సాధ్యమయ్యెను.

చిత్రము 81

పటము - 5

1300 లో బ్రిటీష్ పార్లమెంటు భవనంపై నిర్మించిన టవర్ గడియారము

క్రీ. శ. 1300 సంవత్సరముప్రాంతమందు యూరపులో ప్రప్రథమముగ టవర్ గడియారము వెలసినది. బ్రిటిష్ పార్లమెంటు భవనముపైన, వెస్ట్ మిన్స్‌టర్ శిఖరముపైన ఒకటవ ఎడ్వర్డు ప్రభువు ఇట్టి గడియారమును అలంకారముగ పెట్టించెను. ఇతర దేశముల

239