Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గజశాస్త్రము

సంగ్రహ ఆంధ్ర

అమోనియాగంధకిదము (Ammonium Sulphate) : పైన చెప్పిన విధముగ ఇది చాల ఉపయోగకరమైనదియు, ప్రసిద్ధమైనదియు నగు ఎరువు. ఇది గంధకికామ్లము మూలమున ఏర్పడిన అమోనియా లవణము. అమోనియా వాయువును (Ammonia gas) గంధకికామ్లముతో ప్రతిక్రియ జరిపినయెడల ఈ లవణ మేర్పడును. అమోనియం కార్బనేటు జిప్సమ్‌తో ప్రతిక్రియ చెందినపుడు కూడ ఈ లవణ మేర్పడును. ఇది తెల్లనై, నిగనిగలాడు ఘనపదార్థము. ప్రపంచములో ఉత్పత్తియగు అమోనియం సల్ఫేటు అంతయు ఎరువుగా ఉపయోగింపబడుచున్నది.

మగ్నగంధకిదము (Magnesium Sulphate): ఈ లవణము వైద్యములో విరేచనకారిగా అందరిచే గుర్తింపబడు చున్నది. వైద్యులదగ్గర ఉండవలసిన ముఖ్యపదార్థములలో ఇది యొకటి. దీనిని రంగుల పరిశ్రమలలోను, నూలు పరిశ్రమలలో కూడ వాడుదురు.

ఇది మాగ్నసైటు (Magnesite) అను ఖనిజమునుండి తయారగుచున్నది. మాగ్నసైటు అనునది మెగ్నీషియా కార్బనేటు. మాగ్నసైటును, గంధకికామ్లముతో ప్రతిక్రియ జరపి ఈ లవణమును తయారుచేయుదురు. దీనిని ఎప్సమ్ లవణము (Epsum Salt) అని కూడ అందురు.

గంధకముయొక్క సంయోగపదార్థములు ఇంకను ఎన్నియో కలవు. అవి ఒకవిధముగ, ప్రయోగశాలలలోను, పరిశ్రమలలోను, నిత్యజీవితావసరములలోను ఉపయోగపడుచున్నవి.

ఈ క్రింది పట్టికలో భారతదేశ మందలి గంధకముయొక్క, దాని సంయోగ పదార్థములయొక్క ఉత్పత్తి వివరములు కనపరచబడినవి.

పట్టిక

సంవత్సరములు గంధకము (టన్నులలో) గంధకికామ్లము (హండ్రెడు వెయిటులలలో) అమోనియం సల్ఫేటు (టన్నులలో) జిప్సమ్ (టన్నులలో) బెరైటీస్ (టన్నులలో)
1943 30,141 31.151 19,460 82,287 8,860
1953 - 327,753 317,721 585,839 9,400
1954 - 388,333 340,772 612,320 18,171
1955 - 488,569 392,808 689,905 7,623
1956 - - 388,432 845,583 6,315
1957 - - 379,734 922,000 12,913
1958 - - - 790,000 13,822

కె. యన్. కొ.


గజశాస్త్రము :


         'అశ్వపూర్వాం రథమధ్యాం
         హస్తినాద ప్రబోధినీం
         శ్రియందేవీ ముపహ్వయే.’

అని హస్తినాదములచే ప్రబోధింపబడుచున్నదిగా జగన్మాత శ్రీదేవి స్తుతింపబడినది. గోవు, అశ్వము, గజము వంటి కొన్ని జంతువులను భారతీయులు మంగళ ప్రదములనుగా భావించినారు. సేనాంగములుగా గజాశ్వముల యుపయోగ మానాడు విశేషముగా నుండెడిది. సంఘమునకు అనేక విధములుగా అవసరములైన యీ గజాశ్వాదులను గురించి ప్రత్యేకముగా కృషిసలిపి ప్రాచీనులు గ్రంథములను రచించియున్నారు.

గజోత్పత్తి గాథ : కశ్యపబ్రహ్మ భార్యలలో పదుమూడవది క్రోధ యనునామె. అమెకు పండ్రెండుగురు పుత్రికలు. వారిలో భద్రముద్రకు ఐరావతమను దిగ్గజ శ్రేష్ఠమును, శతయను నామెకు తక్కిన దిగ్గజములును ఉద్భవించినవట ! మాతంగియను నామెకు పుట్టిన గజములే మాతంగములు. ఏనుగులు, సామజము లనబడుట కొక హేతువు చెప్పబడినది. మతంగ మహర్షి పరమేశ్వర సంతుష్టికై సామగానము గావించుచుండెనట ! అట్టి

224