Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గండికోట

శిథిలావస్థయం దున్న గజశాలలు, అశ్వశాలలు పూర్వపు టౌన్నత్యమును చాటుచున్నవి. అచటి ఒక దేవాలయమున శిథిలములు కనిపించును. పడిపోయిన ఒక ద్వారశాఖ పైభాగమున బుద్ధుడు యోగసమాధియందుండి నట్లు కనిపించును. ఎడమవైపున నొక చతురస్రాకృతి గల మసీదు కలదు. దాని దక్షిణపుగోడ వెలుపలిభాగమున 15 కమానులు, తూర్పుభాగమున 20 కమానులు, ఎత్తైన అరుగుమీద నున్నవి. కమానుల లోపల గదులు కలవు. ఇందలి గచ్చుతో దీర్చిన శిల్పము కడు రమ్యముగానున్నది.

ఈ కోటను ప్రదక్షిణముగా చుట్టివచ్చినచో కనిపించు దృశ్యములు పెక్కులు కలవు. వాటిలో ఒక కట్టడము కలదు. అందు పూర్వపు రాజులు ధాన్యమును నిలువ చేయుచుండిరట.

ఈ కట్టడపు నాలుగు గోడలును ఒక్కొక్కటి మూడేసి మూరల మందము కలిగియున్నవి; సుమారు ఇరువదియైదు అడుగులకంటె నెక్కువ ఎత్తుకలిగియున్నవి. లోపల పండ్రెండు స్తంభములు రాతితో గట్టినవికలవు. ఈ స్తంభములు రెండున్నర మూరలు చౌకముకలిగినవిగా నున్నవి. ఇవి యెత్తుగానుండి నాలుగు స్తంభముల పై భాగమున చిత్రమగు కమానుల పొందిక కలిగి ఒక్కొక్క సంధియందును ఇనుపయుంగరములు బిగింపబడియున్నవి. ఈ కట్టడమునకు ఉత్తరభాగమునందు పైప్రదేశమునకు ఎక్కు సోపానముల వరుస కలదు. పై కెక్కిన యెడల కనులు తిరుగును. పై భాగమున పడిన వర్షపు తాకిడి వలన క్రింది గృహములో నుండు ధాన్యమునకు ఎట్టి నష్టము కలుగకుండునట్లు పై కప్పు చక్కని రాతికంకరచే

చిత్రము - 71

పటము - 6

మాధవరాయ దేవాలయ శిథిల గోపురము.

215