Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గండికోట

సంగ్రహ ఆంధ్ర

పులివెందుల, ప్రొద్దుటూరు, కమలాపురము, కడప తాలూకాలు చేరిన భాగము. కర్నూలుజిల్లా యందలి కొంతభాగము దీనికి జేరినట్లు తెలియుచున్నది. ఇది యంతయు ఉదయగిరి రాజ్యమునకు లోబడిన రాష్ట్రమై తత్పాలకుల దగ్గరి బంధువులకు చెందినదిగా నున్నది.

శ్రీకృష్ణదేవరాయలు శా. శ. 1421 ( క్రీ. శ. 1490) లో వచ్చినట్లు స్థలపురాణ మొకటి తెలుపుచున్నది. శా. శ. 1481 ( క్రీ. శ. 1509) వత్సరమున కృష్ణరాయలు పాలించినట్లు చరిత్రవలన విదితమగుచున్నది. శ్రీ సదాశివరాయలు కూడ ఈ గండి కోటను పరిపాలించినట్లు తెలియుచున్నది. తాళికోట యుద్ధానంతరము గండికోట తిమ్మానాయకుని స్వాధీనమం దున్నట్లును, తాళికోటయుద్ధానంతరము గోలకొండ నవాబులు ఈ ప్రాంతమును ఆక్రమించు పర్యంతము గండికోట హిందువుల పాలనమునందే యున్నట్లును, ఆతడు విజయనగరరాజుల ప్రతినిధి యైనట్లును తెలియుచున్నది. పదునారవ శతాబ్దియందు జరిగిన సంగ్రామములలో రాజ్యపాలనము తారుమా రయ్యెను. మహమ్మదీయులు దేశము నాక్రమించుకొన్న తరువాత గండికోట ముఖ్య పట్టణమయ్యెను. 'మీర్ జుమ్లా' మొదటి నవాబు. అతడు హిందూ దేవాలయములను పడగొట్టించి, శిల్పముతో గూడిన ఆ దేవాలయముల రాళ్ళతో జుమ్మా మశీదును కట్టించెనట ! మాధవస్వామి ఆలయములో గోవధ కావించెనట ! ఈ అత్యాచారములు గోలకొండ నవాబునకు తెలిసి అతనిని శిక్షించుటయేగాక మాధవస్వామి ఆలయమున చెడగొట్టబడిన భాగములను మరల అతడు బాగు చేయించెనట!

మీర్ జుమ్లా రాచగాదెను (ధాన్యపుకొట్టును) నిర్మించెను. అది చాల గొప్పది. అది ఇపుడు బాటసారులకు వసతిగృహముగా ఉపయోగపడుచున్నది. మీర్ జుమ్లా అనంతరము గండికోటను ఆర్గురు పాలించిరి.

చిత్రము - 70

పటము - 5

కోటలోపలి గండికోట పట్టణము. ఎత్తు కట్టడము శత్రువులను గమనించుట కేర్పరుపబడినది.

దూరమున అభేద్యమగు కోటగోడగలదు.


19వ శతాబ్ది ప్రారంభమున కడప నవాబగు అబ్దుల్ నబీఖాను దీనిని పాలించి, రాజ్యమును విస్తరింపజేసెను. క్రీ. శ. 1740 లో మహారాష్ట్రులు అబ్దుల్ నబీని ఓడించిరి. అబ్దుల్ నబీ తన కుటుంబమును సురక్షితముగ గండికోటకు చేర్చుకొనెను. 1780 లో అబ్దుల్ నబీఖాను పరాజితుడు కాగా, ఈ గండికోట టిప్పుసుల్తాన్ స్వాధీనమయ్యెను. ఈస్టిండియా కంపెనీవారి కాలమున మారణ సామగ్రి యగు మందుగుండు ఫిరంగులు ఇందు రక్షింపబడు చుండెను. ప్రకృతము కొన్ని ఫిరంగిగుండ్లు జంబుల (జమ్ముల) మడుగు తాలూకా ఆఫీసునందు భద్రపరుపబడి యున్నట్లు తెలియుచున్నది. ఈ కోటకట్టకడపట కొందరు పాళెగార్ల క్రిందనుండి క్రమముగ ఆంగ్లేయుల స్వాధీన మయ్యెను.

గండికోట కోటగోడలు బలిష్ఠములు. దీని మహాద్వారమువరకు దాదాపు మూడువందల సోపానముల పంక్తి కలదు. లోపల మరియొక ద్వారము కలదు. ఈ రెండుద్వారముల మధ్యభాగమున కోటగోడవెంబడి సైనికులు నివసించు ప్రదేశములు, శత్రువుల రాకను నిరీక్షించు సోరణగండ్లు కలవు. ఈ ఆవరణములోనే

214