Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రైస్తవ మతము

సంగ్రహ ఆంధ్ర

చరిత్ర : క్రీ. శ. ప్రథమశతాబ్దాంతమునకు క్రైస్తవమతము రోమను సామ్రాజ్యమునందలి దాదాపు అన్ని దేశములందును వ్యాపించెను. రోమనులు బ్రిటనును జయించుటతో ఈ మతము బ్రిటనులో ప్రవేశించెను. మతముయొక్క ముఖ్యస్థానము జెరూసలెమునుండి రోమునగరమునకు మారెను. మొదటి క్రైస్తవమిషనరీలు పెక్కుమంది రోమునుండి వెడలినవారే. క్రీ. శ 70 వ సంవత్సరమున జెరూసలెము రోమనులచే దగ్ధముచేయ బడిన తరువాత రోమకనగరమే క్రైస్తవమతమునకు స్థిరనివాసమయ్యెను. అప్పటినుండి క్రైస్తవ మతవ్యాపనము జరుగుచునే యుండెను. కాన్‌స్టాంటైను చక్రవర్తి విజయానంతరము ఆయన చనిపోయిన (క్రీ. శ. 337) నాటికే క్రైస్తవమతమునకు ఆతని రాజ్యమున ముఖ్యస్థానము లభించెను. ప్రతికూల యత్నములను జూలియడ్ మొదలయినవా రెన్ని చేసినను మతవ్యాపన మాగలేదు. మత పరివర్తనములో మతమును తీసికొని వారు తమ ఆచారముల ననుసరింపవచ్చునను అంగీకారము ఫలితముగా కాఠిన్యము సడలింపబడెను. చిల్లర సిద్ధాంతములపై కొన్ని అభిప్రాయభేదములు వచ్చినను, వ్యాపనము కొనసాగుచునే యుండెను. క్రీ. శ. 800 లో షార్లమేన్ (Charlemagne) అను నాతడు చక్రవర్తి యైన తరువాత రాజ్యమునకును, మతమునకును అత్యంత సన్నిహిత సంబంధము ఏర్పడెను. పోపునకు అధికారము హెచ్చెను. రానురాను యూరపునందలి పశ్చిమదేశము లీ అధికారమును ప్రతిఘటించినవి. పశ్చిమ మతసంస్థ (Church) కును, తూర్పు మతసంస్థకును క్రీ. శ. 1054 నాటికిని విభేదములు పెరిగెను. అవి ఇప్పటికిని నిలచి యున్నవనియే చెప్పవలెను. మరియు ఆశ్రమవాస పద్ధతి, తపస్సు, సన్యాసము మొదలగునవి ప్రబలి మతమును బలపరచెను.

ఇంతలో ముద్రణ యంత్రమువచ్చి బైబిలు అచ్చుపడుట తటస్థించెను. అప్పటినుండి విమర్శకుల దృష్టి దాని పైబడి చర్చలు ప్రబలెను. రానురాను 16 వ శతాబ్దమున మార్టిన్‌లూథర్ అను జర్మన్ మతవేత్త బైబిలుయొక్క నిజార్థమిది యని తన వ్యాఖ్యానమును లేవనెత్తెను. దానితో పూర్వాచారపరాయణులు క్యాథలిక్కులుగను, నూతన తెగవారు ప్రొటెస్టెంట్లుగను గట్టిపడిపోయిరి. అప్పటిలో క్రమముగా క్యాథలిక్కు సిద్ధాంత మంతరించునని అనుకొనిరి. కాని జెసుయిట్లు (Jesuits) అను తెగవచ్చి లయోలా అను వాని నాయకత్వమున క్యాథలిక్కుశాఖకు బలమిచ్చెను. కాని రెండుతెగలు స్థిరమైపోయెను. (Catholics and protestants). అప్పటినుండి ప్రొటెస్టెంటుల లోనే అనేక విభాగములు పెరిగెను. ఈ విభాగము మతమునకు కొంతదెబ్బ యైనను, ఈ తెగలన్నిటికిని మతప్రచారము ముఖ్యాశయమగుటచే, వారు తమ మిషనరీలను ప్రపంచమున కంతటికిని పంపి మతమును వ్యాపింపచేసిరి. తెల్లజాతులవారు ప్రపంచమున వ్యాపించి తాముపోయిన స్థలములకునెల్ల మిషనరీలను తీసికొనిపోయి రాజ్యమును, మతమును, వ్యాప్తములనుగా చేసిరి. పశ్చిమార్థగోళములోను, పూర్వార్ధగోళములోని ఇండియా, చీనా మొదలగు అనేక దేశములలోను ఈ మతము అపారముగా వ్యాపించెను. ఈ 20వ శతాబ్దమున మున్నెన్నడును లేనంత క్రైస్తవ మతానుయాయుల సంఖ్య యున్నదని లెక్కలవలన తెలియుచున్నది. ప్రొటెస్టెంట్లలోని తెగలన్నియు కలిసిపోవలెనని క్రీ. శ. 1948 సం.ర మున స్థాపింపబడిన ప్రపంచ మతసంస్థ (World Council of Churches) యత్నించెను. కమ్యూనిజము, నాజీజము వచ్చినవెనుక మతమునకు కొంత దెబ్బ తగిలినను, మిషనరీలు నూతనస్థలములలో మత వ్యావనము చేయుచుండుటచే, మొత్తముమీద అనుయాయులసంఖ్యకు దెబ్బ తగులలేదు.

ముఖ్యములైన తెగలు: క్యాథలిక్కులు తమ సిద్ధాంతములే మోక్షమార్గములని నొక్కి వక్కాణించుచుందురు. వీరిలో మరల రోమన్ క్యాథలిక్కులనియు, ఇంగ్లీషు క్యాథలిక్కులనియు విభేదము కలదు. ప్రొటస్టెంట్లలోని తెగ లింతకంటె నెక్కుడుసంఖ్య కలవి. వానిలో ముఖ్యము లీక్రింద ఈయబడినవి ;

1. ప్రెస్‌బిటేరియన్లు (Presbyterians), 2. బాప్టిస్టులు (Baptists), 3. లూథరన్‌లు (Lutherns), 4. మెథడిస్టులు, 5 క్వేకర్లు (Quakers). 6 క్రిస్టియన్ సైంటిస్టులు (Christian Scientists), 7. ప్రాచ్య ఆర్థడాక్సు చర్చి సభ్యులు (Members of East

136