పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తొలిపలుకు

సంగ్రహాంధ్ర విజ్ఞానకోశము రెండవ సంపుటము నాంధ్రావళి కర్పించి దాదాపు రెండు సంవత్సరములై నది. ఈనాటికి మరల మూడవ సంపుటము నందించ గలుగుచున్నందుకు మా కానందముగా నున్నది. విజ్ఞానసర్వస్వ యాత్రలో మూడవ మజిలీ గడచి పురోగమించుచున్న మాకును, వివిధ ప్రణాళికల ద్వారా ప్రగతిపథమున సాగిపోవుచున్న దేశీయులకును ఇది మిక్కిలి యానందదాయక మనియు ప్రోత్సాహకరమనియు మా విశ్వాసము. 790 పుటలతో నొప్పారు నీ తృతీయ సంపుటమున కెకులే మొదలు క్షేత్రయ్య వరకును, ఖగోళశాస్త్రమాదిగా ఖరోష్ఠిలిపి పర్యంతమును, గండికోటనుండి గ్రీసు దేశముదాకను, ఘంటశాల ప్రభృతి మర్మయంత్రము సీమగను, చంద్రగిరి ఆదిగా చైనా పర్యంతమును, ఛత్రపతి శివాజీ మొదలుకొని ఛాయాసోమనాథాలయము వరకును, 107 గురు రచయితల 182 వ్యాసము లిమిడియున్నవి. వీటిలో 69 వ్యాసము లాంధ్రదేశమునకు సంబంధించినవి. 227 పటములతోడను, 8 త్రివర్ణ చిత్ర ములతోడను సజ్జితమైన దీ సంపుటము. పాఠకుల సౌకర్యమునకై పూర్వమువలెనే సూచికయును పారిభాషిక పదములును అనుబంధముగా కూర్చబడినవి. విజ్ఞానసర్వస్వ నిర్వహణము సామాన్య కార్యముగాదు. దీనికి అంగబల అర్థ బలములతో పాటు విద్వాంసులగు మేధావుల యండదండలు మిక్కిలి యావశ్యకములు. కేంద్ర ప్రభుత్వము వారును, రాష్ట్ర ప్రభుత్వము వారును మరియు నెందరో యుదారు లగు దాతలును మా కార్థిక సహాయము చేసినారు. విద్వాంసులు తమ రచనల ద్వారా సహాయపడినారు. ఈ సహాయసంపదలను కూడగట్టుకొని తదేక దీక్షగా కృషి చేయుచున్న ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనంగారి సేవ ప్రశంసనీయమైనది. వారికి చేదోడు వాదోడుగా నున్న శ్రీ ఆదిరాజు శ్రీ ఆది రాజు వీరభద్రరావుగారిని, వారి కార్యా లయపు సిబ్బందిని అభినందించుచున్నాను. ఉభయ ప్రభుత్వముల యాదరమును, v