పుట:SamskrutaNayamulu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
66

సంస్కృతన్యాయములు

భిక్షుకపాదప్రసారణన్యాయము

భిక్షకుడు గృహస్థునయింట భోజనశయనా లాభము నపేక్షించియు, నొకమాఱు తనయభీష్టమునంతయు వెలి బుచ్చినచో బాదప్రసారణమును దుర్ఘటమని యెంచి మొదట నిస్పృహయనుబోలె బ్రవేశించి క్రమముగ దనకోరికల బ్రకటించి కతార్ధుడవును.

భిక్షుభియాస్టాల్యనధిశ్రయణన్యాయము

బిచ్చగాడు వచ్చునను వెఱపున వంట మానినట్లు, మృగభియా సస్యానాశ్రయణ న్యాయమువలె

భీమభాసదృడన్యాయము

ఎరిగినవాడు కైంద గూలునుగూడను.

భూమిరధికన్యాయము

రధయుద్ధము చేయుటను నేర్పు నాచార్యుడు శిష్యునకు దొలుత నేలపై నొకరధమును గీచి ఆగీతలలో శిష్యుని నిలిపి నేర్పును. రధములో నుండియే యుద్ధముచేయుచు న్నట్లుభావించి నేర్చుకొని శిష్యుడు ఉత్తరత్ర యుద్ధరంగము లలో మహారథికుడై జయము గాంచును. తొలుత వెదురుపుల్లలతో బాణప్రయోగమును నేర్ధుకొని తదుపరి శగలాఘవమును గడించినట్లు.

శుష్కేష్టీన్యాయము జూడుము