పుట:SamskrutaNayamulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
65

సంస్కృతన్యాయములు

భామతీన్యాయము

భామతి అను భామిని భర్తను సుఖపెట్టును; సవతులను ధుఖపెట్టును. అందఱి నెవడును సంతోషపఱుపనేఱడు; అందఱికి నెవ్వడు నిష్టుడు కాడు.

ఖారైకదేశావతరణన్యాయము

నెత్తిపైనున్న బరువులో కొంతబరువును తీసినేయుట. అనగా ఏపనినైనను సులభము చేసికొనుట.

భావార్ధాదికరణన్యాయము

"స్వర్గకాముడు భావించవలెను" అనిన, దేనిని ఎట్లు, దేనిచేత, మున్నగుప్రశ్నలు వచ్చును.

భిత్తిపిడాలన్యాయము

గోడమీది పిల్లివలె, ఎటువీలైన నటుతప్పించుకోజూచుట.

భిల్లీచందనన్యాయము

అదివిజాతిస్త్రీ చందనపు చెట్టుకొమ్మలే నఱికి వంటకట్టె లుగా నుపయోగించును. అతిపరిచయమువలన అవజ్ఞ, నిత్యసాన్నిధ్యమున అనాధ రము సంభవించును.