పుట:SamskrutaNayamulu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
63

సంస్కృతన్యాయములు

బ్రాహ్మణవసిస్టష్ఠన్యాయము

బ్రాహ్మణులు వచ్చినారు; వసిష్ఠుడును వచ్చినాడు అనిన వసిష్ఠుడు భ్ర్రాహ్మణేతరుడని అర్థము కాదు. వసిష్ఠుని యందు ప్రత్యేక్ మధికాభిమానమును సూచించుట.

బ్రాహ్మణుడు స్వధర్మములను విడచి బౌద్ధభిక్షువువలె సంచరించినను బ్రాహ్మణు డనియే వ్యవహరింపబదడును.

భర్చున్యాయము

భర్చుడు బ్రతికియుండియే పిశాచమైనట్లు. ఒకరాజునకు భర్చుడు అను మంత్రి గలడు. అతడు రాజనియక్తుడై శత్రువును జయింప నితరదేశమున కేగెను. అత డాతని నోడించి కొన్ని సంత్సరము లాదేశమునందే యుండెను. విరోథులెవరో "భర్చును శత్రువులు చంపివైచిరి" అరె రాజునకు దెలిపిరి. రాజు మఱొక మంత్రిని నియమించికొనెను. కొంతకాలమునకు భర్చుడు స్వదేశమునకు మఱలి వచ్చి తన స్థానమున మఱొకడు నియమింపబడుటజూచి విరాగియై సన్యసించి అడవికి పోయెను. రాజొకనాడాయడవికి వేటకరిగెను. భటులు భర్చుని చూచిబెదరి "రాజా ! అదుగో, భర్చుని పిశాచము"అని కేకలువైచిరి. అంతకుబూర్వమే అట్లు వినియుండుటవలన రాజు వాని యాకారాదుల్వలన నిజ ముగా భర్చుడు పిశాచి మయ్యెనని నిశ్చయించి కొనెను. (నలుగురూ నంది అనిన నంది: పంది అనిన పంది.)