పుట:SamskrutaNayamulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

సంస్కృతన్యాయములు

దత్తతిలాంజలిన్యాయము
  • నువ్వులూ, నీళ్ళూ విడచుట. (ఆశవదలుకొనుట)
దధివ్రీహిన్యాయము
  • పెరుగు, వడ్లు కలిసినట్లు.
  • జైమిని. 8.213.
దర్పణప్రతిబింబన్యాయము
  • అద్దములోని ప్రతిబింబమువలె.
దర్పణముఖావలోకనన్యాయము
  • ముఖ మెటు లుండునో అట్లే అద్దములోనూ కాంపించును.
  • (ఉన్నదున్నట్లుచెప్పుట.)
దర్వీహోమన్యాయము
  • తెడ్డుతో చేసిన హోమమువలె.
దర్వీపాకరసన్యాయము
  • గరిటె పచనపదార్థము లన్నిటిలో మెలగుచున్నను వాని రుచి గ్రహింపజాలదు.
  • "తెడ్డునకు వచ్చునె పాకగుణాగుణావళుల్"- పాండు.
  • "అడ్డావిడ్డముతిరిగే తెడ్డెఱుగునె పాలతీపి".- వేమన.
దశానామేకదశన్యాయము
  • పదిలో పదునొకండు.