పుట:SamskrutaNayamulu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37

సంస్కృతన్యాయములు

కారితో జెప్పుకొనిరి. గాయము తగిలినకాలితో పిల్లి నడువలేక తక్కిన మూడు కాళ్ళతోనే నడచినందున అమూడుకాళ్ళుగలవారును ఆనష్టము నాలవవానికి నీయ వలసినదని ధర్మాధికారి తీర్పుచెప్పెను.

దగ్ధపత్రన్యాయము
  • ఆకును కాల్చిన నది మసియగును. కాని, తన ఆకారమును మాత్రము విడువదు (రూపాయలనోటును కాల్చినట్లు. అది కాలినను దాని ఆకారము, అక్షరములు, నంబరు ఉన్నట్లే యుండును.) దానిని చూచిన యథార్థపుటాకు కాదని మాత్రము మనము తెలిసికొందుము. (స్వప్న స్త్రీ అని తెలిసికొనినమీదట కామము పొందనట్లు.)
దగ్ధబీజన్యాయము
  • విత్తు కాలిన మొలకెత్తదు.
  • (రాగము నశించిన సంసారబంధమే లేదు.)
దగ్ధరశనాన్యాయము
  • ముప్పిరిగా పేనబడి కాల్చిబడినత్రాడువలె.
  • (పైన్యాయములట్లే.)
దగ్ధేంధనవహ్నిన్యాయము
  • వంటకట్టెలు వంటచేయుటకు తోడ్పడి తాముమాత్రము కాలిపోవును.
  • (తమనష్టముసైతము పాటింపక సజ్జనులు ఇతరులకు సాయపడుదురు.)