పుట:SamskrutaNayamulu.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
359

సంస్కృతన్యాయములు

శ్వా కర్ణేవా పుచ్చే వా చిన్నే శ్త్వవ భవతి నాశ్వో భవతి నాశ్వో న గర్ధభ: చెవ్వుగాని, తోకగాని, కోసివేయబడినను కుక్క కుక్కయే అవునుగాని గుఱ్ఱమో, గాడిదో, కానేరదు.

"ఏకదేశావికృత మనన్యవత్" అని చెప్పబడుటచేత అది గుఱ్ఱముగాక కుక్కయే అవును. చిన్నపుచశ్వదృష్టాన్తమును, న హి గో ర్గడుని జాతే విషాణే నా భగ్నేల్ గోత్వం తిరోధీయతే: న హి కేవల భోజీ దేవదత్తో న్యై: సహ పంక్త్యాం భుంజానో న్యత్వం ప్రపద్యతే" మున్నగువానిం జూడుము.

సందిగ్ధం సప్రయోజనంచ విచార మర్హతి

"సందిగ్ధే న్యాయ: ప్రవర్తతే" చూడుము.

సందిగ్ధన్య వాక్యశేషా న్నిర్ణయ:

విందిగ్ధార్ధము మిగిలిన వాక్యమునుండి నిర్ణయింపవలెను. దీనినే మఱొకరకముగ-- సందిగ్ధేషు వాక్యశేషాత్-- అనియు నందురు.

పకృత్ర్పవృత్తాయా: కి మనగుంఠనేన?

ఒక మాఱు ప్రవరించినదానినె మఱలమఱల చర్వితచర్వణము చేసుకొననేల?

ఒకమాఱునుడువబడిన దానినే మఱల జెప్పుటనవసరము. "వప్రక్రీడాపరిణగగజప్రేక్షణీయం దదర్శ"