పుట:SamskrutaNayamulu.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
360

సంస్కృతన్యాయములు

ఇందు--తిర్వగ్ధంతప్రహరీతు గజ పరిణతో మతు--అను నిఘంటువువలన పరిణతశబ్దముచేతనే వప్రత్రేడారతనజార్ధసిద్ధి కలుగుచున్నను మఱల "వప్రక్రీడాపరిణతుగం" అని మూలమున నుడువంబడినది. అట్లు నుడువుటలో గల ప్రయోజన మెయ్యదియో?

అట్లే--అరుణైకహాయనీ - య నెఱుంగునది. (అరుణైక హాయనీన్యాయము)

సముదాయే వాక్యప్రిసమాప్తి:

మొత్తముచముదాయమును గూర్చి చెప్పబడిన్ విధి వాక్యము ఆసముదాయమున కంతకును వర్తించును. ఉదా- గర్గశతదండనన్యాయము.

నూఱుగురు గగ్గులను దండింపవలయు ననిన క్రమముగ నూఱుగురను దండింపవలయుననియే ఆవాక్యాశయము గాని వారిలో కొందఱిని దండించి కొండఱిని విడిచిపట్టవలయు నని గాదు.

సమ్బవ త్యేకవాక్యత్వే వాక్యచేదశ్చ నేష్యతే

ఒకవాక్యము ఒకేవాక్యముగా నుండుటకు తగియుండంగా దానిని వేఱుచేయుట తగదు.

అనగా--ఒకవాక్యమున కేకవాక్యత్వము సిద్ధించుచుండఘా భిన్నవాక్యత్వమును దాని కాపాదింపజేయుటభిమతముగాదు.