పుట:SamskrutaNayamulu.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
332

సంస్కృతన్యాయములు

మధు పశ్యసి దుర్భుద్దే ప్రపాతం నానుపశ్యసి

మూఢుడా! తేనెనే చూచుచున్నవుగాని, పతనమును మాత్రము గమనించుటలేదు.

ఒకడు చెట్తుచివరకొమ్మలో నున్న తేనెను సంపాదింప వలయునను పేరాసతొ ప్రాకూచుండెడేకాని, లచటికొమ్మ విఱిగి తాను పడుటమాత్రము గమనించుటలేదట.

అట్లే--తుచ్చకామసుఖ మనుభవించు నిచ్చచే చేయరాని పనులతో నడుగిడుటయేగాని మూడులు దానివలన సంభవించు నరకమును మత్రము గుర్తించరు. దీనినే "మధు పశ్యసి దుగ్బ్ర్ ద్ధే ప్రపాతం కిం న పశ్యసి" అనియు నందురు.

మధ్యే పవాదా: పూర్వన్ విదీన్ దాదన్తే నోత్తరాన్

మధ్యనున్న అపవాదములు పూర్వవిధులను బాధించును గాని తరువాతి విధులను బాధింపనేఱవు.

మరణా ద్వరం వ్యాధి:

చావుకంటె వ్యాధి నయము.

మహతాపి ప్రయత్నేన తమిస్తాయాం పరామృశన్

కృష్ణశుక్లవివేకం హి న కశ్చి దధిగచ్చతి.

పెద్దప్రయత్నముతో నొకవస్తువును కారుచీకటిలో పరీక్షించినను దానిస్వరూపమును అనగా--తెల్లనిదో, నల్లనిదో, మఱెట్టిదో ఎవడును తెలిసికొననేఱడు.