పుట:SamskrutaNayamulu.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
333

సంస్కృతన్యాయములు

మహతి దర్పదే మహ న్ముఖం తదేవ కనీనికాయా మణు

పెద్దముఖము పెద్దద్దమందు పెద్దదిగ కనబడును. అయ్యదియే కంటిపాపయందు అణుప్రమాణమున కనపడును.

ఉదా--ఒకటియే వ్యంజకభేదమువలన ఉత్కృష్టమగును. నికృష్టముగను చూడబడును.

మహాన్ మహత్స్యేవ కరోతి విక్రమం

గొప్పవాడు గొప్పవానియందే తన ప్రభావము జూపును.

మహిషీస్నేహప్రతిబద్ధ భిక్షుదృష్టాన్త:

అతీతమహిషీస్నేహప్రతిబద్ధ భిక్షుదృష్టాన్త:

అతీతమహిషీస్నేహన్యాయమును జూడుము.

ఇందొకగాధ కలదు--పూర్వాశ్రమమున బఱ్ఱెయే స్పురణకు వచ్చుచుండెడిదట. గురూపదిష్టమైన మంత్రోపాసనమునకు కనులు మూసినంతనే ఆబఱ్ఱెయే స్పురణకు వచ్చి చిత్తము వికలమయ్యెడిది. అది గమనించి ఉపదేష్ట ఆబఱ్ఱెపైననే తత్త్వము నారోపించి (బఱ్ఱెరూపముగా తత్త్వమును భావింపజేయుచు) ఉపదేశించెను. సన్యాసియు బఱ్ఱెపై మనస్సు నిలిపి క్రమక్రమముగ ఉపాసనావశమున మహిషీరూపమును పాఱద్రోలి ఆరోపితతత్త్వమునే మనమున దృఢముచేసి బ్రహ్మజ్ఞాని యయ్యెను.

కావున నెట్తిస్థితియందున్నదానికి అట్టివిధముననే వానిమన: ప్రవృత్తికనుకూలముగ తత్త్వోపదేశము గావించి ధన్యుం జేయనవును.