పుట:SamskrutaNayamulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17

సంస్కృతన్యాయములు

కూర్మకిశోరన్యాయము
  • తాబే లొకచో గ్రుడ్లుపెట్టి అటునుండి నెడలిపోవును. దానికి ఆగ్రుడ్లసంగతియే జ్ఞాపకములో నుండదు. ఆగ్రుడ్లును చెడిపోక అట్లే యుండును. హఠాత్తుగ ఎన్నడో దానికి గ్రుడ్లవిషయము స్ఫురణకు వచ్చును. వెంటనే ఆగ్రుడ్లు పిల్ల లగును.
  • ఈన్యాయము చాలవఱకు గురుశిష్యన్యాయమునకు సన్నిహితముగ నుండును.
కూర్మాంగన్యాయము
  • తాబేలు తన తల కాళ్లు చేతులు మున్నగు నవయవము లన్నియు తనకడుపులోనికి లాగికొని జాగ్రతపెట్టుకొనును.
కూశ్మాండస్తేయన్యాయము
  • గుమ్మడికాయలదొంగ లెవరనిన భుజములు తడవి చూచు కొన్నట్లు.
కృపణధనన్యాయము
  • లోభివానిధనము లోకులపాలు.
కేకరాక్షన్యాయము
  • మెల్లకంటివా డొకవైపు చూచుచుండ వేఱొకవైపు చూచుచున్నట్లు కాన్పించును.
కేతకీకుసుమన్యాయము
  • మొగలిపూవు సువాసనగలది యైసను, ముండ్లు గలిగి యుండుటచే కోసికొనుటకు శక్యముగాకుండును.