పుట:SamskrutaNayamulu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

సంస్కృతన్యాయములు

కులాలకీటన్యాయము
  • కుమ్మరపురువు మట్టిలో పొరలాడు చున్నను దానికి మట్టి యంటుకొనదు.
కుక్షిస్థమక్షికాన్యాయము
  • ఈగ చిన్నదైనను కడుపులో జొచ్చి తిన్న యన్నమంతయు వెడలగ్రక్కించును.

'ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా' - వేమన.

కూపకూర్మన్యాయము
  • నూతిలో నున్న తాబేలు ఆనూయియే సమస్తప్రపంచమని భావించును.
కూపఖననన్యాయము
  • కొంప లంటుకొన్న తరువాత నూయి త్రవ్వ నారంభించినట్లు.
కూపమండూకన్యాయము
  • నూతిలోనున్న కప్ప అనూయియే సమస్తప్రపంచమని భావించును.
  • భీమే. 1.13.
కూపయంత్రఘటికాన్యాయము
  • నూతిలోని నీరు చేదునపుడు యంత్రమునందలి ఘటమొకపు డూర్ధ్వగతిము నొకపు డథోగతియు నొందు చుండును.