పుట:SamskrutaNayamulu.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
323

సంస్కృతన్యాయములు

"ప్రకృతిప్రత్యయౌ పరస్పరాపేక్ష మర్ధ మభిదధాతే నచప్రకృత్యా ప్రత్యయార్ధో భిధీయతే.....) ప్రత్యయార్5ధము అన "భావన" అని శాస్త్రవ్యవహారము. "ప్రత్యయార్ధం సహ బ్రూత: ప్రకృతిప్రత్యయౌ "సదా ప్రాధాన్యా ద్భావనా తేన ప్రత్యయార్ధో వధార్యతే." ప్రకృతి ప్రత్యయౌ ప్రత్యహర్థం సహ బ్రూత: ప్రాధాన్యేన పై--ప్రకృతిప్రత్యయౌ ప్రత్యయార్ధం సహ బ్రూత:--అనుదానిం జూడుము.

ప్రకృతివ దనుకరణం భవతి

ఒకదాని ననుకరించుట అద్ధానిప్రకౄతి (అనుసరింపబడినది) వలెనే యుండును (గాని ప్రకృతి, అనుకృతులకు భేద మిసుమంతయు నుండదు.)

ఉదా--- మాఱుమ్రోత.

ప్రక్షాలనాద్ధి పజ్కస్య దూరా దస్పర్శనం పరం

బురద (త్రొక్కి) కడుగుకొనుట కంటె మొట్తమఒదటనే దానికి దూరముగ నుండుట మంచిది.

"అడుసు త్రొక్క నేల? కాలు కడుగ నేల?

సంకప్రక్షాలనన్యాయమును జూడుము.

ప్రతి ప్రధానం గుణ ఆవర్తనెయ:

ప్రధానవిషయమునకు విధింపబడిన విధి ననువర్తించుపట్ల అప్రధానవిషయము ననుసరించిన తక్కిన గుణములను