పుట:SamskrutaNayamulu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15

సంస్కృతన్యాయములు

  • "దివా కాకరుతా ద్భీతా రాత్రౌ తరతి నర్మదామ్" - భోజచరితమ్‌.
కాకాక్షిన్యాయము
  • కాకి యేప్రక్క చూచిన ఆప్రక్కనున్న కన్నే కనబడును గాని, ఒకసారిగ రెండు కన్నులును కనబడవు.
కాకదంతపరీక్షాన్యాయము
  • కాకికి దంతము లుండవు. కావున కాకికి దంతము లెన్ని యని పరీక్షింపబోవుట నగుబాటు.
కాచకుంభదీపన్యాయము
  • గాజుకుప్పెలోని దీపము ఎంతగాలివీచినను కదలదు.
  • (వేమనశతకము)
కార్యకారణన్యాయము
  • కార్యమునుబట్టి కారణమును నిర్ధారణ చేసినట్లు.
కార్యార్ధిన్యాయము
  • కార్యసిద్ధి గోరువాడు గర్వపడరాదు.
కాశకుశావలంబనన్యాయము
  • దర్భ దొరకనిచో రెల్లే దర్భగా నుపయోగించుకొన్నట్లు. (ఏటబడి కొట్టుకొనిపోవువాడు దర్భపుడక దొరకినను పట్టుకొనును.)
కుంభదీపికాన్యాయము
  • కుండలో బెట్టినదీపము పైకి గాన్పించకున్నను లోపల వెలుగుచునే యుండును.