పుట:SamskrutaNayamulu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
295

సంస్కృతన్యాయములు

ద్విర్బద్ధం సుబద్ధం భవతి

రెండుసారులు కట్టబడినరి బాగుగ గట్టిగా కట్టబడిన దవును.

ధనక్షయే పర్ధతి జాఠరాగ్ని:

ధనము తఱిగినపుడు ఆకలిబాధ యెక్కువగును. దరిద్రునికి ఆక లెక్కువ అని తెనుగుసామెత.

న ఖలు శాలగ్రామే కెరాతశసజ్కీర్ణే ప్రతివన న్నపి బ్రాహ్మణ, కిరాతో న భవతి

కిరాతశతసంకీర్ణమైన శాలిగ్రామమను పేరుగల పల్లెలో నివిసించుచున్నను బ్రాఃమణుడు బ్రాఃమణుడే యవును. గాని కిరాతుడు కాజాలడు.

న్ చ ప్రయోజన మస్త్రా చాణర్య: స్వప్నేపి చేష్టతే ఉపయోగము లేనిదే ఎవడును కలలోనైన వెట్తిపనికిని బ్రయతింపడు.

"లాభములేని శెట్టి వఱదన పోవునా" అన్నట్లు.

న చ సత్వత్ర తుల్యత్వం స్యాత్ప్రయోజనకర్మణాం

ప్రయోజనకక్రిలన్నియు నొకేవిధముగ నెన్నడు నుండవు. సేనాపతి మాటలచే భృత్యులను నియోగించును; యోధుడు శత్రుకృంతనమునకై చలనముతో శాస్త్రప్రయోగము చేయును, రాజు దగ్గఱనుండియే అందఱను