పుట:SamskrutaNayamulu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
289

సంస్కృతన్యాయములు

జ్వరహరతక్షతచూడారత్నాలజ్కారోపదేశవత్

జ్వరముతో బధపడువానికి తక్షకుని నేత్తిపైనున్న మణిని తీసికొనివచ్చిన జ్వరము తగ్గిపోవునని వచించినట్లు.

తక్షకుని శిరముపై నున్న మణిని తీసికొనివచ్చుట అసంభవము. అట్తి సంభవమైన వచనమును నుడువుట కాకదంత పరీక్షవలె నిరర్ధకమగును. కావున అసంభవర్ధమై నిరర్ధ్కమైన వాక్యప్రయోగము గల తావుల నీన్యాయ్ము మవతరించును.

తత్ద్యానాపన్నే తధర్మలాభ:

ఏస్థానమును పొందినపుడు ఆస్థానమునకు సంబంధించిన ధర్మములు వానికి జెందును.

"స్థానివ దదేశా: = తత్ధ్సానస్థితవర్ణమువలెనే ఆదేశమువచ్చును" అను పాణినిసూత్రము ననుసరించి యీ న్యాయము ప్రవృత్తమైనది.

ఉపాధ్యాయునిశిష్యుడు యాజ్యకులమున కరిగి ఉపధ్యాయినికి దగిన అగ్రాసనాధిపత్యమును తాను పొందునట్లు.

తదభిన్నాభిన్నస్య రద్భిన్నత్వం

ఒకవస్తువుకంటె భిన్నముకాని వస్తువునకు విరుద్ధముకాక అభిన్నపదార్ధము మొదటివస్తువుకంటె అభిన్నమే అవును.