పుట:SamskrutaNayamulu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
283

సంస్కృతన్యాయములు

పాలక కటజ శబ్దములు అర్ధము నిచ్చును. శబ్దస్వరూప నిష్పత్తికిమాత్ర మావ్యుత్పత్తిసిద్ధార్ధములే మూలకారణములు. సంజ్ఞావాచకము లైనపుడు గోపాల కటజ సబ్దములు శ్రవణమాత్రమునన ఒకే రూఢ్యర్ధమును నిరూపింపక మరియొక సందిగ్దార్ధమునుగూడ స్పురింపజేయుచున్నవి. కాన గోపాల, కటజశబ్దములు కృత్రిమములవుచున్నవి. ఇక, గోపాలునిల్, కటజుని తీసుకొని రమ్ము అనిన గోపాల, కటజ నామము గలవారలనే తీసుకొని వత్తుముగాని, శబ్దస్వతసిద్దార్ధము లవు అలకాపరిని, మంచముమీద పుట్టినవానిని తీసికొని రాము.

కేవలై ర్వచవై ర్నిర్ధనాధమర్ణిక ఇవ సాదూన్ భ్రామయన్

ఋణము తీర్చుకొన మఱొకచో ఋణము గూడ పుట్టకచిక్కువడి ఋణదారను కేవలము మాటలతో నటునిటు త్రిప్పు ధనము లేని నిఱుపేదవలె.

పరస్పరాశ్రయదోషమును, స్వవచనవ్యాఘాతమును గమనింపక ఊరక యుక్తిపై యుక్తులుగ మాటలాడు వానియందీదృష్టాంతము ప్రవర్తించును.

క్రైయా హె వికల్ప్యతే న వస్తు

ఒకవస్తువును గుఱించిన క్రియమాత్ర మనేకరకములుగ నుండవచ్చును. ఆవస్తువుమాత్రము వికల్పము నొందనేఱదు. "కర్తు మకర్తు మన్యధా నాకర్తుం శక్యం లౌకికం వైదికంచకర్మ | యధాశ్వేన గచ్చతి పద్భ్యా మన్యధావా న