పుట:SamskrutaNayamulu.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
284

సంస్కృతన్యాయములు

వాగచ్చతీతి.....నతు వత్త్వవం నైవమస్తి నాస్తీ తివా వికల్ప్యతే:" శాంకరభష్యం

నడిచి వెళ్ళినను, కారుపై వెళ్ళినను, బండిపై, మఱొక సాధనముపై వెళ్ళినను, తుదకు వెళ్ళకున్నను గమ్యస్థానముమాత్రము మాఱుదు. గమనము మాత్రమే రూపాంతరముల నొందునది.

క్వోష్ద్ర: క్వచ నీరాజనా?

ఎక్కడ ఒంటె; అక్కడ నీరాజన?

ఒంటెకును, నీరాజనకును సంబంధ మెక్కడ? అని అర్ధము. వాజెనీరాజనావిధమున నసందర్భపు పనులయం దీన్యాయమునకు బ్రవృత్తి కలుగును.

గంధాశ్మరజసాస్పృష్టో నష్టో దీప: పున ర్జ్వలేత్

గంధమపురజనుతో తాకినయెడల దీపౌ మొట్టమొదట తగ్గి మఱల మామూలుకన్న నధికముగ వెలుగును.

సంసృత్యవస్థాసిద్ధమైన దు:ఖము ననుభవించి దు:ఖముక్తుడైన వాని కాదు:ఖము గంధకపురజనుతో ముట్టుకొనబడిన దీపమువలె తాత్కాలికముగ నష్టమైనను అంకురము పోక కాలమున మఱల పొడసూపును.

గిరి ముత్పాట్య మూషికోద్దృతా

కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు.