పుట:SamskrutaNayamulu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
273

సంస్కృతన్యాయములు

ఉపయ న్నపయన్ ధర్మో వికరోతి హి ధర్మిణం

ప్రవర్తించుచు, నివృత్తమై ప్రవర్తింపకయు నటు నిటు నుండు ధర్మము ధర్మిని వికరము నొందించును.

ఒకపు డోకరకపుధర్మము, మఱొకపు డింకొకరకపు ధర్మము చెప్పు వస్తుదర్మము ధర్మిని (అలక్షణముగలవస్తువును) మఱొకరమపురూపముగలదానిని జేసివైచును. దీనినే--ధర్మో నికరోతి హి ధర్మణమ్--అనియుకూడ వాడుదురు.

ఉపవాసాద్వరమ్ భిక్షా

ఉపవాసము చేయుటకన్న బిచ్చమెత్తుకొనుట మేలు.

అజ్ఞానముచే భేదత్వకల్పన మొనరించికొని భ్రష్టుడవుట కన్న తనకభిమానముగల మూర్త్యంతరమున మనసు లిలిపి ధ్యానించుట శ్రేయస్కరము.

"మరణా ద్వరం వ్యాధి:" అన్నట్లు

త్సర్గం బాధతే

ప్రవృత్తికి నిమిత్తములు కలిగినదైనను, తొలుత వచింపబడిన సామాన్యశాస్త్రమును, స్వయంప్రవృత్తికి నిమిత్తములు కల తరువాతి8 అపవాదశాస్త్రము బాధించి తాను ప్రవర్తించును.

తనకృత్యము పూర్వమే ముగిసి, తరువాత తత్ప్రవృత్తిచేతనుఫలము కలుగని సందర్భమున నీన్యాయము ప్రవర్తించును. దేవదత్తహంతృహతన్యాయమును జూడుము.