పుట:SamskrutaNayamulu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
259

సంస్కృతన్యాయములు

అనుకరణం హి శిష్టస్య సాధు భవతి సత్పురుషుల ననుకరించుట శ్రేయస్కరము.

"సమున్నయన్ భూతి మనార్యసంగమా ద్వరం విరొధో పి మహాత్మభి: సమమ్" అను భారవి వాక్యమువలె.

అనురాగ మ్నురాగేణ ప్రత్యేష్టవ్య:

తా ననురాగమును జూపి యితరులానురాగము తాను పొందవలెను.

"ఇచ్చిపుచ్చుకోమ్మనట్లు.

అన్యవేశ్మస్థితాద్దూమా న్న వేశ్మాంతర మగ్నిమత్ ఒక యింతిలో నుండి పొగవచ్చుటను చూచి మఱొక యింటిలో నిప్పున్నదని అనుకోనట్లు.

అన్య ద్భుక్త మన్యాద్వాంతం

ఓకడు తినగా మఱొకడు కక్కుకొన్నట్లు. "కాచి న్నిషాదీ తనయం ప్రసూతే కశ్చిన్నిషాదస్తు కషాయపాయీ" అను దానివలె.

అన్యార్ధ మపి ప్రకృత మన్యార్ధం భవతి

ఒకప్రయోజనమునకై కావింప బడిన యొకవస్తువు మఱొక ప్రయోజనమునకుగూడ ఉపయోగించును.