పుట:SamskrutaNayamulu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పారిభాషికాది న్యాయములు

అంగుల్యగ్రే మత్తమాతంగా శ్చరన్తి

నావ్రేలికొనపై మదించిన యేనుగులు తిరుగుచున్నవి అని చెప్పినట్లు.

నమ్మదగనివి, గ్రహింపదగనివి అగు వాక్యములయందీన్యాయము ప్రవర్తించును.

"అంగుల్యగ్రాదివాక్యవ దగ్రాహ్య మితి భావ:" నైషధవ్యాఖ్య.

"అందుల్యగ్రే కరిణాం శతమ్; అంగుల్యగ్రేహస్తియూధ శత మాన్తే; మమ కర్ణకుహరం ప్రవిశ్య సింహ: క్రీదటి; మమ కర్ణే ప్రవిశ్య గజో గర్జతి భేషజ ముచ్యతామ్" ఇత్యాదివాక్యముల వలె.

అంగుల్యగ్రం న తేనై వాంగుల్యగ్రేణ స్పృశ్యతే

ఏదేనివ్రేలికొన ఆవ్రేలికొనచేతనే స్పృశింపబడదు.

"అంగుల్యగ్రం యధాత్మానం నాత్మనా స్ప్రష్టుమర్హతి, స్వాంశేన జ్ఞానమ ప్యేవం నాత్మానం జ్ఞాతు మర్హతి." అంగుల్యగ్రము తనచేతనే తాను స్పృశింపబడనట్లు జ్ఞానము కూడ తనయంశచే దానెఱుంగబడ నేఱదు.