పుట:SamskrutaNayamulu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
252

సంస్కృతన్యాయములు

అంగులిదీపికయా ధ్వాంతధ్వంసవిధి:

మినుకు మినుకు మను నొక చిన్న దీపమును వ్రేళ్ళతో బట్తుకొని కారుచీకటిని బోల్గొట్ట బ్రయత్రించినట్లు. స్వల్పసాధనముచే మాహత్కార్యము సాధింప బూను కొనునపుడీన్యాయ ముపయోగింపబడును.

అంతతో శ్మాసి జీర్యతే

తుదకు ఱాయి కూడ జీర్ణించిపోవును.

"సర్వం నశ్వరం" అనుట కూతగ నియ్యది వాడబడును.

అంతరంగబహిరంగయో రంతరంగం బలీయ:

"అసిద్ధం బహిరంగ మంతరంగే" బహిరంగశాస్త్రీయనిమిత్తసముదాయమున నంతర్భూతములవు సంగములు (నిమిత్తములు) గల విధికార్య మతరంగము. ఆ అంతరంగ(నిముత్తములు)గల విధికార్యము బహిరంగము. ఆ అంతరంగము ప్రవర్తించునపుడు బహిరంగకార్యము అసిద్ధమవును. అనగా---ప్రవర్తింపనేఱదు అను వ్యాకరణ పరిభాషనుండి పైన్యాయము వెలువడినది. అంతరంగబహిరంగకార్యములయం దంతరంగము బలవత్తరము అని న్యాయముయొక్క అర్ధము.

ఉదా:--"కార్యస్య తావ దుపాదానాపేక్షా ప్రధమ ముత్పద్యతే, పశ్చా ద్విరోధిసంసర్గభావాపేక్షా! తధా చాంతరంగబహిరంగయో రంతరంగం బలవ దితి న్యాయే