పుట:SamskrutaNayamulu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
243

సంస్కృతన్యాయములు

హరితాలము, లాక్షాదులవలన నేర్పడినను చిత్రము సింధూరాదులకంటెను భిన్నపదార్ధమైనట్లే పదజన్యమైనను పదములకంటె వాక్యము; పదార్ధముకంటె వాక్యార్ధము భిన్నములు.

ప్రవృత్తిక్రమన్యాయము

పాఠక్రమన్యాయమున విద్దానియర్థము వివరింపబడినది (చూడుడు)

ప్రస్తరప్రహరణన్యాయము

ప్రస్తరప్రహరణమున దర్భాగ్రములను హోమము చేయుట. అనవసరముగ దర్భలను దాచియుంచికొనక వానిని హోమము చేసి తద్ధ్వారా ఉత్కృష్టఫలమును పొందుటయేగాక కర్మకాండానుసరిత్వము మున్నదు ననేక ప్రయోజనములను పొందునట్లు.

అనగా--దర్శపూర్ణమాసలయందు ప్రస్తరప్రహరణము సూక్తవాకములతో విధింపబడియున్ంది. ఆప్రస్తరప్రహరణము(దర్బలతో హోమము) నకు ఫలితమేమన--ఒకహోమాదులకేగాక ఇంకెందును దర్భలకు బ్రయోజనము కాన్పించదు. అట్టి నిరర్ధకపదార్ధములు గుట్టలు గుట్టలుగ నిలువగాకుండబోవుటయు, విధ్యనుసారిత్వము, దేవతాప్రీతి, కర్మాధికారిత్వము మున్నగు ఫలములు ఆహోమము వలన లభించుచున్నవి.