పుట:SamskrutaNayamulu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
242

సంస్కృతన్యాయములు

"నిత్యకర్మణో నిత్యప్రారబ్దకర్మణశ్చ ప్రతినిధినా సమాప నాధికరణమ్" (జైమిని)

ప్రతినిధానన్యాయము

ప్రతినిధి, ప్రతినిధానశబ్దములు పర్యాయము లవుట నియ్యది పై ప్రతినిధిన్యాయరూపాంతరము.

"భోజనలోపే ప్యద్భిర్వాన్యేనవా ద్రవ్యే ణావిరుద్దేన ప్రతినిధానన్యాయేన ప్రాణాగ్ని హోత్రస్యానష్ఠానమ్". కారణాంతరమున భోజన మకృతమైనపుడు నీటిచేగాని మఱొక డవిరుద్ధపదార్ధముచేగాని, ప్రతినిధానన్యాయము నుపాసింపనగును.

ప్రపానకరనన్యాయము

పానకము, రసము మున్నగునవి తత్కారణముకంటె భిన్నములైనట్లు.

"పదార్ధేబ్యో న్య ఏవ వాక్యార్ధ: సానకారివత్! యధా పానకం శర్కరానాగ కేసరమరీచాధిభ్యో ర్ధాంతరమేవ చిత్రం....తధా పదేఖ్యో వాక్యం పదార్ధేభ్యోవాకార్ధ:."

పంచదార, మిరియాలు మున్నగువానివలన తయారైనదే అయినను పానకము శర్కరాదులకంటెను; సింధూరము,