పుట:SamskrutaNayamulu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
221

సంస్కృతన్యాయములు

కరకంకణ, కరిబృంహిత వాజిమదురా, నీలేందీవర న్యాయములను జూడుము.

గణపతిన్యాయము

అన్నిపనులకు మొట్టమొదట మనము విధిగా గణపతిని పూజింతుము. అందఱికన్న మొట్టమొదట ముఖ్యముగ నెన్నుకొనబడువానివిషయమున నీన్యాయము ప్రవర్తించును.

గన్ధర్వనగరన్యాయము

గంధర్వనగము అనగా మాయాప్రపంచము--అసత్యమైసత్యముగాకునుపించుచు క్షణములో నశించుచు మఱల పుట్టుచు మఱల నశించుచు నుండునది.

ఉదా:-- జగత్తు.

"......గంధర్వనగరోపమై:...." భాగవతము

గర్గశతదండనన్యాయము

వందమంది గర్గులను చావమోదుము అన్నట్లు.

"గర్గా: శతం దండ్యంతాం" అన్నపుడు నూఱుగురు గర్గులను ఒకేమా ఱొకేమానవుడు దండించుట దుర్ఘటము గావున ప్రత్యేకముగ ఒక్కొక్కరిని క్రమముగ దండించవలయు నని భావము.