పుట:SamskrutaNayamulu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
222

సంస్కృతన్యాయములు

ప్రత్యేకముగ నొక్కొక్కటిగ చేయుటయం దీన్యాయ ముపయుక్తము.

కాణ్డానుసమన్యాయమును జూడుము.

గర్తవర్తిగోదామాంసవిభజనన్యాయము

కన్నములోనున్న బల్లులు మాంసమునను విభాగించినట్లు, "అనవబుద్ధార్ధే ప్రవృత్తి ర్బలవర్తిగోధావిభజన న్యాయే నాశక్యేతి ధ్వనితమ్"

కన్నములోనున్న బల్లులు కన్నులకు కన్పిపవుగావున వాని మాంసమును నిరూపించి విభాగించు టశక్యము.

అట్లే--

అనఫబుద్ధాంశమున ప్రవృత్తియం దీన్యాయము ప్రవర్తించును.

గర్తస్థమృతసర్పన్యాయము

కన్నములో చచ్చి ఎండిపోయిన పాము కన్నమందే లీనమై యున్నట్లు. సృష్టికి పూర్వము ప్రలయానంతరము పరమాత్మయందు అడగిపోయిన ప్రపంచము వానియందే లీనమైయుండును.

"ప్రాక్సృష్టే: ప్రలయాదూర్ధ్వం నాసీత్కించిద్ద్వజోత్తమ"

గార్హసత్యన్యాయము

గార్హసత్యన్యాయము

గార్జసత్యశబ్ధార్థమువిధమున.

"నివేశన; సంగమనో వసూనా మిత్త్యైన్ద్ర్య గార్జపత్య ముపతిష్థతే" అని వైదికమంత్రము.