పుట:SamskrutaNayamulu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
214

సంస్కృతన్యాయములు

కారణగుణప్రక్రమన్యాయము

కారణము ఎట్టిగుణముగలదై యున్న కార్య మట్టి గుణముతో నొప్పును. నల్లనిమట్టివలన పుట్టిన ఘటాదులు నల్లగనే ఉండును.

కార్పాసరక్తతాన్యాయము

ఎఱ్ఱలక్కలో నానవేసిన పత్తివుత్తులను పాతిపెట్టి ఆచెట్లు నుండి ఎఱ్ఱపత్తియో వచ్చును.

"యధా క్షీరావసేకిఆ దమ్లత్వం పరిహృత్య మాధుర్యముపాదాయానువర్తమానామలకీ కాలాన్తరే పిమాధుర్య మున్మీలయతి, లాక్షారసావనేకాద్వా ధవలిమాన మపహాయ రక్తతా ముపాదాయాదు;వర్తమానం కార్పాన బీజం కుసుమేషు రక్తతామ్".

లాక్షారసావసిక్తకార్పాసబీజన్యాయమును జూడుము.

కెటధృంగన్యాయము

భ్రమరకీటాన్యాయమును జూడుము.

కీబోద్ధారన్యాయము

ప్రవాహములో కొట్తుకొనిపొవు పురువులను తీసి ఒడ్దున పడవైన నవి యొకఆధారమును చూచుకొని సుఖించును.

కీలప్రతికీలన్యాయము

బండిని నడిపే ఇరుసునకు రెండువైపుల చక్రములు జారిపడిపోకుండ నుండుటకై రెండు మేకులు (శాయమేకులు) బిరింతురు.