పుట:SamskrutaNayamulu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
210

సంస్కృతన్యాయములు

వాజిమందురా, నీలేందీవర, కరిబృంహిత, గజఘటా, చంద్రజ్యోత్స్నా, పర్వతాధిత్యకా, పర్వతొపత్యకా, మృగువాగురా న్యాయములను జూడుము.

కరషాభిల్యవ్యాయము కరవిన్యస్తబిల్వన్యాయము }

చేతిలోని మారేడుకాయవలె. స్పష్టముగనున్నదని భావము. "నిశ్శేషోపనిషత్సార స్త దేత దితి సాంప్రతమ్; ఉక్త్యావిష్క్రియతే సాక్షా త్కరవిస్యస్తభిల్వవత్". కరతలామలకన్యాయమును జూడు;ము.

కరిబృంహితన్యాయము

బృంహితమనిన ఏనుగుయొక్క ఘీంకారమని అర్ధము అయినను కరిబృంహితము అని ప్రయోగింతురు. కరకంకణ, గజఘటారి న్యాయములను జూడుము.

కర్ణకొంతేయన్యాయము

కర్ణుడు కుంతికొడుకే అయినను తెలియక రాధేయుడను (రాధకుమారుడను) అను నూహతో నుండెను. కృష్ణాదులవలన వాస్తవ మెఱింగిన పిదప కౌంతేయు డను అని భావించెను.

సింహమేష, రాజపుత్త్రవ్యాధ న్యాయములను జూడుము.